ఎరక్కపోయి ఏదో మాట్లాడి - తనకై తానే ఇరుక్కుపోయిన ప్రియాంక గాంధి!

"ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్నట్లుంది కాంగ్రెస్ పరిస్థితి" ఇప్పుడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ “తురుపు ముక్క” గా ఇంకా చెప్పాలంటే బ్రహ్మాస్త్ర గా ప్రియాంక గాంధిని ప్రయోగిస్తోంది. రాహుల్ గాంధి, కాంగ్రెస్ ను తిరిగి పైకి తీసుకు రాగలిగే సామర్ధ్యం కనిపించని వేళ ఆయనతో పనికాదని స్పష్టం అయిన తరవాత ప్రియాంక గాంధిని రాజకీయ వేదికపైకి తీసుకు రావాలని కోరుకొంటూ వచ్చారు. 

వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినప్పుడల్లా ప్రియాంక గాంధి రావాలనే డిమాండ్ చేస్తూ వచ్చారు కాంగ్రెస్ వాదులు. వారు కోరుకున్నట్టుగా ప్రియాంక రంగం లోకి దిగారు. రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ మీద ప్రధానంగా ఆమె దృష్టి సారించారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈసారి చాలా భిన్నంగా ఉంది. గతం లో అక్కడ చతుర్ముఖ సమరం జరిగేది. ఎస్పీ- బీఎస్పీ- కాంగ్రెస్-బీజేపీ లు ఎవరికి వారుగా పోటీ చేసేవాళ్లు. ఈ నాలుగు సేనల్లో పోరు సరిగా సాగించిన వారిలో ఎవరో ఒకరు గెలిచేవారు.  

అయితే ఈసారి ఎస్పీ-బీఎస్పీ లు 25 సంవత్సరాల తమ రాజకీయ వైరం మరచి బిజేపి ఓటమే లక్ష్యంగా జతకట్టడం – ఈ కార్యక్రమంలో అవి కాంగ్రెస్ ను యూజ్-లెస్ అన్నట్లు పూర్తిగా పక్కనపెట్టడం సహజంగానే  కాంగ్రెస్ పార్టీ కి ఇబ్బందికరంగా మారుతూ ఉంది. ఎస్పీ-బీఎస్సీల బలం ఉన్నది ఉన్నట్టుగా కలిసిపోతే అది బీజేపీని దెబ్బ తీయటానికి కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీయటానికి సరిపోతుంది!

ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధి తన ప్రచారం అనేక పాట్లు పడుతూ అధిక శ్రమకోడ్చి కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తున్నారు. అయితే ఈ హడావుడిలో రాజకీయ పరిణితి లేకుండా ఆవేశంలో ఆమె చేసిన ఒక ప్రకటన కాంగ్రెస్ కు తీరని నష్టం కలిగించేదిగా మారింది. వారణాసిలో తను మోడీ మీద పోటీ చేయటానికి సైతం సిద్ధమని మొదట ప్రియాంక గాంధి ప్రకటించారు. చివరికి ఆమె మాత్రం  ఆ సాహసం చేయలేదు. ప్రియాంక తాను ముందు అన్నట్లు నరేంద్ర మోడీపై ఎందుకు పోటీ చేయలేకపోయారనే విషయంపై ఇప్పుడు వివరణ ఇచ్చుకోవటానికే తన సమయం వినియోగించు కుంటున్నారు! ఆదెలా ఉందంటే:


“నాకు నలభై పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ ను విజయ మార్గంలో నడిపించే పార్టీ బాధ్యత ఉందని, అందుకే వారణాసిలో పోటీ చేయలేదు, పార్టీ నాకు ఆ బాధ్యతలు ఇచ్చింది, అని ప్రియాంక చెప్పుకుంటున్నారు. ఇదెలా ఉందంటే, డ్యామేజ్ కవరేజ్ చేసుకుంటున్నట్టుగా! ఆమెను వారణాసిలో పోటీ చేయమని ప్రజలు ఎవరూ అడగలేదు. అది ఆమె స్వయంగా చేసిన సవాలే! తప్ప అందులో ఎవరి ప్రమేయం లేదని జనం అర్ధం చేసుకున్నారు"   


ఇప్పుడేమో తనకు వేరే బాధ్యతలు ఉన్నాయని ఆమెకు ఆమే చెప్పు కొస్తున్నారు.  తనే సవాల్ చేసి, తనే వెనక్కు తగ్గి, ఇప్పుడు ఏవేవో మాటలు చెబితే అవన్నీ పనికిరాని ప్రహసనమే అవుతాయి కదా! ఇప్పుడు ప్రియాంక తీరు అలానే ఉంది! "ఎరక్కపోయి రాజకీయాల్లోకి వచ్చి నోటికొచ్చింది మాట్లాడి ఇరుక్కుపోయిన ప్రైయాంక ఇక పార్టీని విజయపథం లో ఎలా నడిపిస్తారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: