ముఖ్యమంత్రుల తనయులు ఇద్దరి విజయం అనుమానమే!

రాజకీయాల్లో వారసత్వం ఒక సాంప్రదాయంగా మారింది. సౌత్ లో ముఖ్య మంత్రులు ఇద్దరి తనయులు ఒకేసారి  ఎన్నికల కదన రంగంలోకి దిగడం దేశ వ్యాప్తంగా జన దృష్టిని ఆకర్షించింది.  ఇందులో ఆసక్తికరమైన అంశమేమంటే వీరిలో ఒకరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందే నామినేటెడ్ పదవితో మంత్రిగా వ్యవహరించారు. మరొకరు ముందుగా సినిమాల్లో ప్రయత్నంచేసి అక్కడ ధారుణ వైఫల్యం చవిచూసి ఆతర్వాత పార్టీ కార్యక్రమాలు నామమాత్రంగా చేసి, ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యత్వానికి పోటీ పడ్డారు. ఇద్దరూ రాజకీయ పరిఙ్జానం ఏమాత్రం లేకున్నా తండ్రుల పేరు ప్రతిష్టలను, రాజకీయాధికారం అడ్దం పెట్టుకుని గెలవాలని చూస్తున్నారు. 

వారికి పెద్దగా పరిచయం అవసరం లేదు ఒకరు దేశంలోనే సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రఖ్యాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కాగా మరొకరు అతి తాకువ స్థానాల్లో గెలిచి, దిక్కుమాలిన పరిష్తితుల్లో ఉన్న ఎదటి పార్టీ బలహీనతలతో కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన హెచ్ డి కుమార స్వామి గౌడ తనయుడు నిఖిల్ కుమారస్వామి. ఇక్కడ నారా లోకేష్ 2019 ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తే - నిఖిల్ కుమారస్వామి ఏకంగా పార్లమెంట్ స్థానానికి బరిలోకి దిగారు.

విశేషం ఏమిటంటే, వీరి విజయం విషయంలో కూడా ఒకేరకమైన సంధిగ్ధం నెలకొంది. ముఖ్యమంత్రుల కొడుకులు  అనే ట్యాగ్ వీళ్ల విజయాన్ని సులభతరమే అనేలా చేస్తున్నా, బలమైన ప్రత్యర్థులు, నియోజకవర్గాల పరిస్థితులు వీరి విజయాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తూ ఉన్నాయని ఎన్నికల విశ్లేషకుల భావన. 

కర్ణాటకలోని మండ్య శాసనసభ నియోజక వర్గంలో నిఖిల్ కుమారస్వామికి ఇండిపెండెంట్ అభ్యర్థి రూపంలో బలమైన పోటీ ఎదురైంది. సుమలత అంబరీష్ రూపంలో నిఖిల్ కు ఒక బలమైన ప్రత్యర్థి ఎదురయ్యారు. ఆమెకు అక్కడ అనేక సానుకూలాంశాలు కనిపిస్తూ ఉన్నాయి. సుమలత భర్త దివంగత అంబరీష్ కు ఆ ప్రాంతం ఆటపట్టైంది. ఆ ప్రాంతాన్ని అంబరీష్ జన్మభూమిగా మార్చుకున్నారు. అక్కడి ప్రజలు కూడా అంబరీష్ ను మాంద్య మగాడు గా పిలుస్తూ తమ వాణ్ణి అనుకున్నారు. అలాంటి అంబరీష్  మరణంతో సుమలతపై అక్కడ సానుభూతి వెల్లువెత్తింది.

ఇక ఆమెకు బీజేపీ అధికారిక మద్దతు - కాంగ్రెస్ పార్టీ లోపాయి కారీ మద్దతు వంటివి కలిసి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సానుభూతి మరియు దేవె గౌడ కుటుంబంపై నిద్రాణంగా ప్రజల్లో నెలకొన్న వ్యతిరేఖత ఇతర కారణాలతో సుమలత నెగ్గవచ్చనే అంచనాలు ఏర్పడ్డాయి.  మౌలికంగా అది జేడీఎస్ కు అది అను కూల ప్రాంతం. శాసనసభ ఎన్నికల్లో అక్కడ జేడీఎస్ స్వీప్ చేసింది. ఇది ఒకటీ నిఖిల్ కు అనుకూలంగా కనిపిస్తుంది. ఏతావాతా విజయం పై సంధిగ్ధావస్థ నెలకొంది.

మరోవైపు లోకేష్ పరిస్థితి కూడా కాస్త కుడి ఎడంగా ఇలాగే ఉంది. లోకేష్ కు మంగళగిరిని పలకటం కూడా రాదు అందుకే ఆయనకు “మందలగిరి మాలోకం” అని ముద్దుగా పిలుస్తారు. అక్కడ  ఆళ్ల రామకృష్ణారెడ్డి రూపంలో బలమైన ప్రత్యర్థి లోకేష్ కు ఎదురవుతున్నారు. దానికి మించి ఆళ్ళ చంద్రబాబు నాయుడుపై అనేక కేసుల్లో విజయం సాధించి ఆయన ప్రజా వ్యతిరేఖ కార్యక్రమాలను నిరోధించగలిగారు. అంతే కాదు ప్రజాభిమానాన్ని పలుసేవల రూపంలో చూరగొన్నారు. 

ఇంకా మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉంది. ఇక చాలా కాలంగా అక్కడ తెలుగుదేశం గెలిచిన దాఖలాలు కూడా లేవు. “సీఎం తనయుడు అనే ట్యాగ్” తప్ప అక్కడ లోకేష్ కు మరే విధమైన ప్రయోజనకర అంశాలు కనిపించడం లేదు. ఇక ప్రచారంలో ఆయన భాష జన వ్యతిరేఖత జరిగిన రసాభస జనమెరిగిన సంగతే.

ఈ పరిస్థితుల్లో మంగళగిరిలో లోకేష్ విజయం అంత తేలికైన అంశంగా కనిపించడం లేదు. “ఇలా కర్ణాటక సీఎం తనయుడు - ఏపీ సీఎం తనయుడు ఒకే రకమైన పరీక్షను ఎదుర్కొంటున్నారు”  అయితే ఈ ఎన్నికలతో కుమారస్వామి పదవికి ప్రస్తుతం వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఒకవేళ లోక్ సభలో బిజేపి విజయ ఢంకా మోగిస్తే మాత్రం రాష్ట్ర పొలిటికల్ ఈక్వేషన్లలో మార్పు వస్తే ఆయనకు గడ్డుకాలమే.

ఏపీలో శాసనసభ ఎన్నికలు కూడా జరగుతున్నాయి. గత నాలుగేళ్ళు ఎన్డీఏ తో అంటకాగిన చంద్రబాబు స్వార్ధపరత్వంతో బయటకు రావటం, ఆ కాలమంతా ప్రధాని మోడీని విపరీతంగా పొగిడి ఒక్క సారి నాలుక మడతేసి యూ-టర్న్ తీసుకున్న చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలో తీవ్ర ప్రతిఘటన ఎదురౌతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: