మైగాడ్! ఒక్క శాఖలోనే ఇన్ని లైంగిక వేదింపులా? వాళ్ళు మనుషులా? పశువులా?

అగ్రరాజ్యం అదేమీ సంస్కారం సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో మాత్రం కాదు. సంపద పోగెయ్యటంలో. అంతర్జాతీయంగా వివిధ దేశాల బలహీనతలతో ఆడుకుంటూ తంపులు పెట్టి బ్రతికెయ్యటంలో. నిజంగా చెప్పాలంటే అక్కడ ఆదేశంలో అంతు లేనంత లింగ వివక్ష ఉంది. ముఖ్యంగా ఆదేశ సైన్యంలో జరిగే దుర్మార్గం గుఱించి తెలిస్తే వీళ్ళు ఎంత (అ)నాగరికులో అర్ధమౌతుంది.  

ప్రజలకు, దేశానికి రక్షణ కల్పించే శాఖ అది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన విభాగం అది. కానీ, తలదించుకునే స్థాయిలో లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. అదే, యూఎస్ మిలటరీ. యూఎస్ ఆర్మీలో జరుగుతున్న శారీరక హింస, లైంగిక దాడులపై సర్వే చేయగా విస్తుపోయే నిజాలు బహిర్గతం అయ్యాయి. ఒక్క 2018 సంవత్సరం లోనే అమెరికా మిలటరీలో 20500 కేసులు నమోదయ్యాయి. రేప్‌లు, లైంగిక వేధింపులు, బలవంతపు శృంగారం, దూషిస్తూ సెక్స్‌కు ప్రేరేపించడం లాంటి ఘటనల్లో ఈ కేసులు నమోదైనట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. 

ముఖ్యంగా అక్కడి ఆర్మీలో పనిచేస్తున్న 17నుంచి 24ఏళ్ల మధ్య ఉన్న యువతులు ఇలాంటి దాడులకు ఎక్కువగా గురవుతున్నట్లు తెలిపారు. ఐదేళ్ల క్రితం కూడా ఈస్థాయి లోనే ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. 2016లో ఇలాంటి కేసుల తగ్గుదలకు ఆర్మీఅధికారులు చర్యలుచేపట్టగా ఆ ఏడాది 14900 కేసులు మాత్రమే రికార్డయ్యాయి          2016 తో పోల్చితే కేసుల సంఖ్య 2018కి 38 శాతానికి పెరిగింది.

అదీకాక, గతంతో పోల్చితే లైంగిక దాడి, లింగ వివక్ష, అరాచకపు వ్యవహారశైలి కూడా బాగా పెరిగినట్లు తాజా సర్వేలో తేలిందట. దీంతో, దాడులు జరగకుండా కఠిన చట్టాలు తీసుకు రావాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: