చివరి నిమిషంలో...చంద్రబాబు కి వెన్నుపోటు..!!!!

NCR

ఏపీలో ఎన్నికలు జరిగిన తరువాత పోలింగ్ సరళిని బట్టి వైసీపీ అధికారంలోకి వస్తుందని దాదాపు అందరూ అంచనాలు వేశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఏపీ ఇంటిలిజెన్స్  చంద్రబాబు ఓటమి ఖాయమే వార్తని ముందుగానే చెప్పడంతో, చంద్రబాబు సైతం ఈవీఎం లపై అభ్యంతరం తెలిపారని, రాజకీయ పరిశీలకులు తేల్చి చెప్పారు. అందుకు తగ్గట్టుగానే  చంద్రబాబు నాయుడు ఈవీఎం లపై జాతీయ స్థాయిలో పోరు చేసి తాను ఓడిపోతే అందుకు కారణం ఈవీఎం లేనని చెప్పకనే చెప్పేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ

 

అసలు చంద్రబాబు ఓటమి చెందితే అందుకుగల కారణాలు ఏమిటి..?? ఎన్నికలు మరో 10 రోజులు ఉన్నాయనగా రైతులకి విడుదల చేసిన అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ వంటి దివ్యాస్త్రాలు వేసినా చంద్రబాబు ఓటమి ఖాయమని ఏ లెక్కలు కట్టి చెప్తున్నారు..?? అనే విషయాలపై సుదీర్ఘంగా ఆలోచన చేసి రిపోర్ట్ తెప్పించుకున్న చంద్రబాబుకి అసలు నిజాలు వస్తావాలు ఇప్పుడు తెలుస్తున్నాయని అంటున్నారు.

 

చంద్రబాబు ఓటమి చెందటానికి అనేక రకాల కారణాలు ఉన్నా ముఖ్యంగా నేతల విషయంలో చంద్రబాబు చూపించిన ఉదారతే చంద్రబాబు ఓటమి చెందేలా చేయనున్నాయని అంటున్నారు. టీడీపీకి ఆయువుపట్టు అయిన గోదావరి జిల్లాలలో టీడీపీ పరిస్థితి మరీ దయనీయంగా మారనుందట. ఈ రెండు జిల్లాలలో టీడీపీ  నేతలు అధికారంలో ఉన్న సమయంలో చేసిన దారుణాలే చంద్రబాబుని ఏపీ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలాఉంటే ఎన్నికల చివరి నిమిషంలో చంద్రబాబు కి కొంతమంది నేతలు వెన్ను పోటు పొడవటం పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా నిలవనుందని అంచనాలు వేస్తున్నారు. ఇంతకీ చంద్రబాబుకి  వెన్నుపోటు పొడించింది ఎవరు..??

 

ఎన్నికల్లో రాజకీయ నేతలు డబ్బుతోనో లేక మరేదన్నా వస్తువులని ఇచ్చే తమకి ఓటు వేయాల్సిందిగా ప్రజల వద్దకి వెళ్తుంటారు ఇదితప్పని తెలిసిన ఆ సమయంలో ఈ తంతు సహజ ప్రక్రియలా జరిగిపోతుంది. ఈ క్రమంలోనే చాలా నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్ధుల తరుపున డబ్బులు పంచె భాద్యతలు తీసుకున్న కొంతమంది నేతలు  ఆ డబ్బులని తమ జేబులోకి నింపుకున్నారని దాంతో మనకి  పడాల్సిన ఓట్లు వైసీపీకి పడ్డాయని సాక్షాత్తు భాదిత  అభ్యర్ధులు చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నారట. తమ ఉప్పు తిని తమకే వెన్ను పోటి పొడిచారని సదరు అభ్యర్ధులు చంద్రబాబు వద్ద వాపోవడం ఇక్కడ కొసమెరుపు. ఏది ఏమైనా చంద్రబాబు కి సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: