ప్రజాస్వామ్యం దెబ్బ ఎలా ఉంటుందో నరేంద్ర మోడీకి రుచి చూపిస్తా! చాలెంజ్

బెంగాల్ సంచలనం మమతా బెనర్జీ తన వ్యూహాలకు తిరుగే లేదని మరోసారి నిరూపించుకున్నారు. బెంగాలీలు దీదీ (అక్క)గా పిలుచుకొనే 61 ఏండ్ల మమత అటు వామపక్ష-కాంగ్రెస్ కూటమిని, ఇటు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ దాడిని ఎదురొడ్డి, ఒంటి చేతితో తన పార్టీని విజయపథంలో నడిపించి రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకొన్నారు.

అలాంటి మమతబెనర్జీ ధిక్కారమున్ సైతునా! ధిక్....అంటూ అగ్గిమీద గుగ్గిలమే అయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలను "లూటీదారులు" గా ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొనడంపై ఆ పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండి పడ్డారు. నరేంద్ర మోడీకి ప్రజాస్వామ్యం అంటే ఏమిటో దాని దెబ్బరుచి ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు. 

పురూలియాలో నేడు (మంగళవారం) జరిగిన ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, డబ్బు తనకో లెక్క కాదని కుండ బద్ధలు కొట్టారు. ఆ కారణం తోనే నరేంద్ర మోడీ బెంగాల్ వచ్చి తృణమూల్ కాంగ్రెసును - టోల్ కలెక్టర్ గా నిందిస్తూ పార్టీపై పలు ఆరోపణలు చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యం గొప్పతనం ఏమిటో, ప్రజాస్వామ్యం సత్తా ఏమిటో ప్రధాని నరేంద్ర మోడీకి సారీ ఎక్స్పైరీ పీఎం కు తాను చూపించాలని అనుకుంటున్నట్లు మమత నెనర్జీ చెప్పారు.

జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్న వారిని మమతబెనర్జీ అరెస్టు చేస్తున్నారంటూ నరేంద్ర మోడీ చేసిన ఆరోపణలపై స్పందించారు. రాముడి పేరు చెప్పుకునే మీరు కనీసం ఒక్క రామాలయమైనా కట్టించారా? అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే వీళ్లకు రాముడు గుర్తుకొస్తాడని, రాముడిని ఎన్నికల ఏజెంటు గా చేయడం ఎన్నికలొచ్చిన ప్రతిసారీ బీజేపీకి అలవాటని మమతబెనర్జీ దయ్యపట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: