టీవీ 9 రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసు..ఉచ్చు బిగిస్తున్నదెవరు?

Ratna Kumar
టీవీ 9 వాటాల అమ్మకం వివాదం కొత్త మలుపు తిరిగింది. యాజమాన్యానికి తెలియకుండా నిధులు మళ్లించారంటూ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ పై  ఫోర్జరీ కేసు నమోదైంది. రవిప్రకాష్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులు తరలింపు చేసారంటూ అలంద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ చేసింది. దీంతో తెలంగాణా పోలీసులు రవిప్రకాష్ ను అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. 


ఏబీసీఎల్ కార్పోరేషన్ నుంచి 90 శాతం షేర్లు కొనుగోలు చేసి అలంద మీడియా కొన్ని రోజుల క్రితం టీవీ9 ను టేకోవర్ చేసింది. అయితే తన ఆధిపత్యాన్ని కాపాడుకునే క్రమంలో సీఈఓ రవిప్రకాష్ కు అలంద మీడియాకు పొసగడం లేదని వార్తలు వచ్చాయి. అదిప్పుడు 100 శాతం నిజం అని తాజాగా కేసుతో రుజువైంది. అలందా మీడియాతో ఢీకొట్టేందుకు సిద్ధమైన రవిప్రకాష్ మధ్యలో సినీ హీరో శివాజీ వంటి కేరెక్టర్ లను కూడా ప్రవేశపెట్టాడు. శివాజీతో పాటు మరికొంతమందికి కూడా రవిప్రకాష్ టీవీ9 లో షేర్లు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అవసరం అయినప్పుడు వాళ్లందరినీ ప్రవేశపెట్టి టేకోవర్ ను అడ్డుకోవాలన్నది అతని ప్లాన్ అని అలందా మీడియా పసిగట్టినట్టు తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. 


దాదాపు 500 కోట్ల ఈ డీల్ లో కొనుగోలుదార్లు మైహోం రామేశ్వరరావు, మేఘ కృష్టారెడ్డి ఉన్నారు. వీరిద్దరూ తెలంగాణా సీఎం కేసీఆర్ కు సన్నిహితులు కావడంతో టీవీ9 రవిప్రకాష్ కు కష్టకాలం మొదలైనట్టే. మరోవైపు రవిప్రకాష్ ధైర్యం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో కేసీఆర్ ఈ వ్యవహారంలో కాస్త సీరియస్ గానే స్పందించవచ్చని సమాచారం. పక్కా బిజినెస్ డీల్ కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో ఈ వ్యవహారం ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: