టీవీ నటితో పెళ్లి చేయాలని బెదింపులు.. పోలీసుల అదుపులో బీటెక్ విద్యార్థి..
ఇదంతా గమనించిన అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా.. బెదిరింపులకు పాల్పడిన యువకుడిని గోబిచెట్టిపాళేయానికి చెందిన భరత్‌గా గుర్తించారు. అయితే అతడు ఉద్యోగం కోసం చెన్నై వచ్చినట్లు పేర్కొన్నారు. తనకు రితికా అంటే చాలా ఇష్టమని, ఆమెను పెళ్లి చేసుకుంటానని భరత్ విచారణలో చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
తమిళంలో ప్రముఖ టీవీ సీరియల్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు రితికా. ఓ ఛానల్లో ప్రసారం అవుతున్న రాజారాణి సీరియల్‌తో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తోంది. అలాగే ఆమె డబ్స్మాష్, టిక్‌టాక్ యాప్‌ల్లోనూ తరుచూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఫేమస్ అయ్యారు.