కెసిఆర్, జగన్ ఇద్దరు కలిసి ఇక బాబుకు చుక్కలు చూపిస్తారు ..!

Prathap Kaluva

జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని తయారు చేసిన సంగతి తెలిసిందే. అయితే మోదీ మళ్లీ పీఎం పీఠం ఎక్కకుండా చేయడమే లక్ష్యంగా సాగుతున్న చంద్రబాబు... అందుకోసం ఏకంగా కాంగ్రెస్ పార్టీతో జతకట్టేశారు. తనకు అనుకూలంగా ఉన్న పార్టీలతో ఆయన మంతనాలు కూడా జరుపుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీకి పెద్దగా ఎంపీ సీట్లు దక్కే ఛాన్స్ లేదన్న వాదన ఆయన స్పీడ్ కు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తోంది.


ఇదే సమయంలో ఈ దఫా ఏపీలో వైసీపీ మెజారిటీ ఎంపీ సీట్లను - తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లను టీఆర్ ఎస్ సాధిస్తాయని అంచనాలున్నాయి. ఈ క్రమంలో ఈ రెండు పార్టీలతో కాంగ్రెస్ పార్టీ మంతనాలు సాగించేందుకు రంగంలోకి దిగిందట. అయితే ఇక్కడే ఈ రెండు పార్టీ అధినేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - కల్వకుంట్ల చంద్రశేఖరరావులు తమదైన కొత్త వ్యూహాన్ని తెర ముందుకు తెచ్చారట.


తమకు రాజకీయంగా ఆగర్భ శత్రువైన చంద్రబాబు ఉండే కూటమిలోకి తామెలా వస్తామని అనుకుంటున్నారంటూ... కాంగ్రెస్ దూతలను వారు నేరుగా ప్రశ్నించారట. మోదీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమికి మద్దతు ఇచ్చేందుకు తమకేమీ అభ్యంతరం లేదని అయితే చంద్రబాబు ఉండే కూటమిలో మాత్రం తాము భాగస్వాములం కాలేమని తేల్చేశారు. అంటే... యూపీఏ నుంచి చంద్రబాబును గెంటేస్తే... ఆ కూటమిలో చేరేందుకు తాము సిద్ధమేనని కూడా వారు తేల్చేశారట. మరి ఈ రెండు పార్టీలకు ఎంత లేదన్నా... 30కి పైగానే సీట్లు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో యూపీఏ కూటమి బాబును దూరం చేసుకునేందుకు వెనుకాడకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: