నరేంద్ర మోడీకి మమత బెనర్జీకి ఇప్పుడు బేధమేముంది?

దేశ ప్రధానితో సహా ఏవరిని తన రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి అనుమతించని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రజాస్వామ్యవాది ఎలా అవుతారు?  ఇది సాధారణ పౌరుల ప్రధాన ప్రశ్న. ఈ దేశంలో ప్రతి రాష్ట్రం ప్రతి పౌరుని స్వంతం. పశ్చిమ బెంగాల్ మమత దీదీ వారసత్వ సంపద కాదు కదా! ప్రజలందరిది. అసలు దేశ ప్రధానిని, అధికార పార్టీ అధ్యక్షుణ్ణి వారి ప్రయాణించే విమానాన్ని రాష్ట్రంలో దిగటానికి అనుమతి నివ్వకపోవటం దుశ్చర్యకాదా? అప్పుడు ఆమె ఏప్పుడూ ప్రవచించే స్లోగన్  "సేవ్ డెమాక్రసీ-సేవ్ నేషన్" ఎలా యదార్ధమౌతుంది. అమె ను ఆమెను సమర్ధించేవాళ్ళు అస్థిత్వం ప్రశ్నార్ధకం కాదా! వీరంతా ప్రదాని నరేంద్ర మోడీని నియంత అనటంలో ఔచిత్యం ఎక్కడుంది.  

ఎన్నికల సమయంలో బెంగాల్‌లో హింసను ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రచారం చేయకుండా నిషేధించాలని బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు ప్రశాతంగా జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరుతూ, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఈసీకి విజ‍్క్షప్తి చేశారు. బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని, రాజ్యాంగ వ్యవస్థలన్నీ మమత చేతిలో బంధీలుగా ఉన్నా యని వారు ఆరోపించారు. మే 19న జరిగే చివరి విడత ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనకుండా ఆదేశాలు జారీచేయాలని వారు డిమాండ్‌ చేశారు.

కాగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బెంగాల్‌ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం వార్తల ద్వారా తెలుస్తూనే ఉంది. ఆరోవిడత పోలింగ్‌ లో భాగంగా జరిగన అల్లర్లలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో పలువురు గాయపడగా, పోలింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పూర్తిగా బెంగాల్‌లోనే మకాం వేశారు. వారిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజధాని కోల్‌కతాలో గత మంగళవారం నాడు బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

అమిత్‌ షా ర్యాలీ లో పాల్గొనగా, ఘర్షణలు జరగడంతో ర్యాలీని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. అమిత్‌ షా ర్యాలీ పై టీఎంసీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఈ గొడవ ప్రారంభమైందని అధికారులు చెప్పారు. కోపోద్రిక్తులైన బీజేపీ మద్దతు దారులు టీఎంసీ కార్యకర్తలతో గొడవకు దిగి ఒకరి నొకరు కొట్టుకున్నారు. అక్కడి మోటార్‌ సైకిళ్లకు నిప్పు పెట్టారు. ప్రముఖ తత్వవేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని కూడా బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటన తర్వాత కోల్‌కతాలోని పలు ఇతర ప్రాంతా ల్లోనూ హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో చివరి విడత ఎన్నికల్లో టీఎంసీ నేతలను కట్టడి చేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: