ప‌చ్చ‌పార్టీకే జై కొట్టిన ల‌గ‌డ‌పాటి స‌ర్వే...సీట్ల లెక్క తెలిస్తే షాకే...

Pradhyumna
ప‌చ్చ‌పార్టీకి అనుకూలంగా స‌ర్వేలు చేయ‌డంలో నేర్ప‌రి అయిన మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ తాజాగా మ‌రోమారు అదే పని చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు వెల్లడించడానికి మరో 24 గంటల సమయం ఉన్నా ఏపీలో సైకిల్ పార్టీదే అధికార‌మ‌ని  సూచ‌న‌ప్రాయంగా శ‌నివారం ప్ర‌క‌టించిన ల‌గ‌డ‌పాటి తాజాగా త‌న ఫ్లాష్ టీం స‌ర్వేలో అదే తెలిపారు. 

ఫ్లాష్ టీం స‌ర్వే పేరుతో ల‌గ‌డ‌పాటి వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఓటు బ్యాంక్ న‌మోదు కాలేద‌ని, మ‌రోవైపు కొంద‌రు ఎమ్మెల్యేల‌పై స్ప‌ష్ట‌మైన వ్య‌తిరేక‌త ఉంద‌న్నారు. ఓటు వేసిన త‌ర్వాత బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన వారు వైసీపీకి అంండ‌గా ఉండ‌గా...సైలెంట్ ఓటు టీడీపీ వైపు ప‌డింద‌ని పేర్కొన్నారు. వైసీపీకి పురుషులు ఎక్కువ‌గా ఓట్లేశార‌ని.... తెలుగుదేశం పార్టీకి మ‌హిళ‌లు అండ‌గా నిలిచార‌ని, యువ‌త ఎక్కువ‌గా జ‌న‌సేన వైపు మొగ్గు చూపింద‌న్నారు. 

ల‌గ‌డ‌పాటి పేర్కొన్న స‌ర్వే సీట్ల వివ‌రాలు ఇవే
అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు
తెలుగుదేశం పార్టీ - 100+- 10
వైసీపీ- 72+- 07
ఇత‌రులు- 03++-02
పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలు
టీడీపీ--15+-02
వైసీపీ ---10+-02
ఇత‌రులు 0 నుంచి ఒక‌టి
వివిధ పార్టీల ఓటింగ్ శాతం
టీడీపీ -- 43 నుంచి 45%
వైసీపీ -- 40 నుంచి 42%జ‌న‌సేన - 10 నుంచి12 %


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: