నవీన్ పట్నాయక్ నరేంద్ర మోదీతో దోస్తీకి రడీ! బీజేడీ ఇక బీజేపి మిత్రుడే!

నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు. రాజకీయం అధికారంవైపే ప్రవహిస్తుంటుంది. ఒక్కసారి ఆఫ్ట్రాల్ ఎక్జిట్-పోల్ పలితాలు బిజేపికి అనుకూలంగా రావటం ఆలస్యం, దేశ రాజకీయ మొత్తం రాజధాని వైపుకు ప్రవహించటం మొదలెట్టింది. 


కేంద్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. బీజేపీ కూటమికి 300 లకు పైగా లోక్‌సభ స్థానాలను గెలుచు కుంటుందని అంచనా వేశాయి. ఈ క్రమంలో దేశంలో కూటమి రాజకీయాలు ఊపందుకున్నాయి.

బిఎస్పి మాయావతి కాంగ్రెస్ సోనియా గాంధితో చంద్రబాబు మద్యవర్తిత్వంలో జరప తలపెట్టిన భేటీ, ఎక్జిట్-పోల్ పలితాల తరవాత రద్దై పోయింది. అలాగే డీఎంకే ఎంకే  స్టాలిన్ లో కూడా ఏదో మార్పొచ్చిందట.  


ఎవరితో కలిసి వెళ్లాలి? ఎవరికి వ్యతిరేకంగా నడుచు కోవాలన్న దానిపై పార్టీలు సమాలోచనలు చేస్తున్నాయి. ఎగ్జిట్-పోల్స్ ఫలితాల నేపథ్యంలో ఒడిశాలోని అధికార పార్టీ బీజేడీ (బిజూ జనతాదళ్) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒడిశా ప్రయోజనాల దృష్యా కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి తాము మద్దిస్తామని స్పష్టంచేసింది.

అమర్ పట్నాయక్, బీజేడీ నేత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే పార్టీగానీ, కూటమికి గానీ మేం మద్దతిస్తాం. ఒడిశా ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఒడిశాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం సాధిస్తాం అని కేంద్రానికి అనుకూల ప్రకటన చేయటం కూడా జరిగిపోయింది.

ఇంతవరకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తున్నారు. అంతేకాదు కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌ పైనా అనాసక్తి చూపిస్తున్నారు. తద్వారా తనది తటస్థ వైఖరని చెప్పకనే చెప్పారు.

ఐతే ఎగ్జిట్-పోల్స్ తర్వాత తన పంథా మార్చుకుంది బీజేడీ. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి మద్దతు ప్రకటించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వంలో చేరి, తమ రాష్ట్రానికి ప్రయోజనాలను చేకూర్చుకోవాలని భావిస్తోంది. మళ్లీ నరేంద్ర మోదీ ప్రభుత్వమే రాబోతోందన్న ఎగ్జిట్-పోల్స్ అంచనాల నేపథ్యంలో, బీజేడీ చేసిన ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తాము బీజేపీతో దోస్తీ చేసేందుకు సిద్ధమేనన్న సంకేతాలను బీజేడీ పంపించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: