చంద్రబాబుకు షాక్: రేపటితో కర్ణాటకంలో కుమార ప్రభుత్వం పతనమేనా?

ఎగ్జిట్-పోల్స్ ఫలితాల ప్రకటనలతో తిరిగి అధికారంలోకి వచ్చేది బీజేపీ నాయక్త్వంలోని ఎన్డీయేనే అని తేలిపోయింది. అయితే బోటాబొటీ సంఖ్యా బలంతో నడుస్తున్న కర్ణాటక, మధ్యప్రదేశ్‌ లోని ప్రస్తుత ప్రభుత్వాలు కూలిపోతాయని ప్రచారం జోరందుకుంది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, ఆ ప్రభుత్వం అధికారం కోల్పోవటం తధ్యమని రేపు సాయంత్రం వరకే హెచ్ డి కుమారస్వామి ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటారని కేంద్రమంత్రి సదానంద గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు సరైన సమయం ఆసన్నమైందని అన్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత రోషన్ బేగ్ సిద్దరామయ్యపై నిన్న విరుచుకుపడిన అనంతరం సదానందగౌడ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు అసమర్థుడని, మాజీ ముఖ్యమంత్రి  సిద్ద రామయ్య అహంకారి అని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌-చార్జి కేసీ వేణుగోపాల్‌ జోకర్‌ అని రోషన్‌ బేగ్‌ వరసగా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులందరిని తిట్టి పోసిన సంగతి తెలిసిందే. 

రేపు వెలువడనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే అత్యధిక సీట్లు దక్కుతాయంటూ ఎగ్జిట్‌-పోల్స్‌ అంచనా వేసిన పలితాలు వచ్చిన నేపథ్యంలో రోషన్‌ బేగ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో రోషన్‌ బేగ్‌ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్తపరిణామాలకు దారి తీస్తుందని వ్యాఖ్యానించిన సదానంద గౌడ, రేపు సాయంత్రం వరకే కుమారస్వామి ముఖ్యమంత్రి పదవిలో ఉంటారని అనడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత ఆస్తకికరంగా మారాయి. అంతేకాదు ఈ సందర్భంగా రోషన్‌ బేగ్‌ రాహుల్ గాంధి కి తన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో జాగ్రత్తగా ఉండాలని సూచన కూడా చేశారు.

అంతేకాదు చంద్రబాబు తన చాణక్యంతో మోడీ సారధ్యంలోని బిజేపి ప్రభుత్వాన్ని కర్ణాటకలో గద్దె నెక్కకుండా జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణాన్ని అధికారంలోకి తెచ్చానని చెప్పుకుంటూ ఉంటారు. పాపం! ఆయనకూ ఈ సమాచారం భారమే కదా!   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: