మే 23 - హిట్లర్ పతనమైన రోజు - ఏపీలోనూ అదే సీన్‌..?

Chakravarthi Kalyan
హిట్లర్ చరిత్ర మరువలేని నియంత.. లక్షల మందిని పొట్టనపెట్టుకున్న నరరూప రాక్షసుడు. అందుకే ఎవరైనా దుర్మార్గ నేతలను హిట్లర్‌తో పోలుస్తుంటారు. హిట్లర్ పుట్టిన రోజు ఏప్రిల్ 20.. ఆయన పతనమైన రోజు మే 23.


అయితే విచిత్రంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు పుట్టిన రోజు కూడా ఏప్రిల్ 20 కావడం విశేషం. అలాగే ఈ ఏడాది ఎన్నికల ఫలితాలు వస్తున్న రోజు.. హిట్లర్ పతనమైన మే 23నే కావడం మరో కాకతాళీయం.. ఈ విచిత్రాన్ని వైసీపీ శ్రేణులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి.

ఏపిలో హిట్లర్ పాలన గురువారం నాటితో అంతం కాబోతోందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. హిట్లర్ పుట్టిన రోజు ఏప్రిల్ ఇరవైనే చంద్రబాబు కూడా పుట్టారని,అలాగే హిట్లర్ పతనమైన రోజు మే ఇరవై మూడు, యాదృచ్చికంగా అదే రోజున చంద్రబాబు ప్రభుత్వం పతనం అవుతోందని ఆయన అన్నారు.

ఈ మేరకు ఒక పోటోను కూడా ఆయన జత చేసి ట్విటర్ లో పోస్టు చేశారు. అది వైరల్ అవుతోంది. హిట్లర్‌ బాబు పాలన రేపటితో ముగియనుందని విజయసాయి జోస్యం చెప్పారు. మరి ఈ జోస్యం ఎంతవరకూ నిజమవుతుందో..?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: