కేసీఆర్! రాష్ట్ర పాలన సరిగా చూడు! దేశం సంగతి మేం చూసుకుంటాం! తెలంగాణా జనం

దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. దేశం యావత్తు నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తుండగా తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిక్యత చూపుతోంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరగ్గా, ఫలితాల కోసం మే 23 వరకు నిరీక్షణ తప్పలేదు. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్, ఈ ఎన్నికల్లో కారు జోరుకు బ్రేకులు పడ్డాయి.  మెజార్టీ సీట్లలో ఆధిక్యంలో ఉన్నా, కాంగ్రెస్‌, బీజేపీలు తమ ప్రభావం చూపుతున్నాయి. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో సిట్టింగ్ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవిత వెనుకంజలో ఉన్నారు. 

"సారు.. కారు.. పదహారు.. " నినాదంతో తెలంగాణ లోక్-సభ ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తెలంగాణా ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. తెలంగాణను బంగారు తెలంగానా చేసి చూపమంటే, కేంద్రంలో అధికారంలోకి రాగలనని, తనకు పదహారు ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరిన మాటను తెలంగాణ ప్రజలు తిరస్కరించారు.

రాష్ట్ర పాలన చూడకుండా దేశానికి నువ్వు చెసేదేంటి, ఇక్కడ ప్రతిపక్షాన్ని చంపిన నిన్ను ఎట్టిపరిస్థియ్తుల్లో కేంద్రానికి చేర్చే తప్పుపని ఎట్టి పరిస్థితుల్లో చేయమని చెపుతూ ఆయనకు పదహారును సగం చేసి ఎనిమిది స్థానాలిచ్చి ప్రతిపక్షానికి ప్రాణం పోశారు యధార్ధవాదులైన తెలంగాణా ప్రజలు. అందుకే 16 సీట్లలో గెలుస్తామని ధీమా చెప్పిన కేసీఆర్ ఆయన మాటలను గాలికి వదిలేశారు. 

ఇప్పటివరకూ వెలువడిన సమాచారం ప్రకారం తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో అధికార టీఆర్ఎస్ కేవలం 8 స్థానాల్లో మాత్రమే అధిక్యతలో నిలవగా, అనూహ్యంగా బీజేపీ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో, ఒక స్థానంలో మజ్లిస్ అధిక్యంలో ఉంది. పదహారు సీట్లలో కారు గెలుపు ఖాయమని. వేడుకలు చేసుకోవాల్సిందిగా పిలుపు ఇచ్చిన కేసీఆర్ మాట ఈసారి నీటి మూటైంది. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అంచనాలు కేసీఆర్ చెబితే తప్పు కావన్నట్లుగా ఉన్న దానికి భిన్నంగా ఫలితాలు రావటం గమనార్హం.

ప్రస్తుతం ఉన్న అధిక్యతల్ని పరిశీలిస్తే టీఆర్ఎస్ కేవలం ఎనిమిది స్థానాల్లో మాత్రమే అధిక్యతలో ఉంది. దీని కంటే కూడా కేసీఆర్ ను బాధించే అంశం మరొకటి ఉందని చెప్పాలి. ఆయన కుమార్తె కవిత నిజామాబాద్ లో ఓటమిదిశగా పయనిస్తున్నారు. ఆమె ఓటమిని ఆయన జీర్ణించుకోలేరని చెప్పకతప్పదు. పదవులు అన్నీ నీ కుటుంబానికె ఎందుకు? అంటూ కవితను నుంచి ఎంపి పదవిని జనం గుంజేసుకొని బిజేపిని గెలిపించారు.

అప్పటికే ఎన్నికలు జరిగి ప్రజా నిర్ణయం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది కాబట్టి సరిపోయింది కాని చివరి విడతలో ఎన్నికలు జరిగి ఉంటే కేసీఆర్ టీఅరెస్ కు కూడా  తెలంగాణా ప్రజలు సమాధి కట్టి ఉండేవారని అంటున్నారు ప్రజలు. కారణం ఆయన పాలనకు కనీసం పరీక్షలు సరిగ్గా నిర్వహించే సామర్ధ్యం లేదంటున్నారు ప్రజలు. ఇంటర్ పరీక్షల నిర్వహణ పాపం ఇరవైకి పైగా విధ్యార్ధు ఆత్మ హత్యలు చేసుకున్నారు. 

పెద్దపల్లి.. జహీరాబాద్.. మెదక్..మహబూబ్ నగర్.. నాగర్ కర్నూల్.. వరంగల్.. మహబూబాబాద్.. ఖమ్మం ఎంపీ స్థానాల్లో మాత్రం టీఆర్ఎస్ గెలుపు దిశగా పయనిస్తుంటే.. మరో తొమ్మిది స్థానాల్లో ఓటమి దిశగా వెళుతున్న దుస్థితి.

బీజేపీ అధిక్యతలో ఉన్న ఎంపీ స్థానాలు చూస్తే.. అదిలాబాద్ సోయం బాబురావు (బీజేపీ)  కరీంనగర్ బండి సంజయ్ (బీజేపీ) నిజామాబాద్ ధర్మపురి అరవింద్ (బీజేపీ)
సికింద్రాబాద్ కిషన్ రెడ్డి (బీజేపీ)

కాంగ్రెస్ అధిక్యతలో ఉన్న ఎంపీ స్థానాలు:  చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి (కాంగ్రెస్) నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్)
మల్కాజిగిరి రేవంత్ రెడ్డి (కాంగ్రెస్)

మజ్లిస్ అధిక్యతలో ఉన్న ఎంపీ స్థానం: హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ (మజ్లిస్)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: