అవినీతి అక్రమాలే చంద్రబాబును టిడిపిని నిట్టనిలువుగా ముంచేశాయి

ఏపీలో ఇసుకమాఫియా దోపిడీ ₹12500 కోట్లు ఉంటుందని ఒక అంచనా. ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్" ఏపీ ప్రభుత్వానికి ఏకంగా ₹100 కోట్ల జరిమానా విధించిందంటే ఈ ఇసుక దోపిడీ ఎంతగా ఉన్నదో అర్థమవుతుంది. ంఉఖ్యమంత్రి చంద్రబాబు అండతో ఏపీలో దాదాపు 500కుపైగా ఇసుక రీచ్‌లను టీడీపీ నాయకులు తమ దోపిడీ కేంద్రాలుగా మార్చుకొన్నారు.  ఎవరైనా ప్రశ్నిస్తే అధికారపార్టీ నేతలు దాడులకు దిగారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఇసుకమాఫియాకు అడ్డుపడినవారిని పోలీస్‌ స్టేషన్ ఎదుటే ఇసుక ట్రాక్టర్లతో తొక్కించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఇసుక అక్రమ తవ్వకాన్ని ప్రశ్నించినందుకు మహిళా తాసిల్దార్ వనజాక్షిపై దాడిచేసిన ప్రభుత్వవిప్ చింతమనేని ప్రభాకర్‌కు చంద్రబాబే అండగా నిలబడ్డారు. 

అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలను పట్టుకున్న అధికారులపై అనంతపురం జిల్లాలో దాడులు జరిగాయి. తుంగభద్ర మధ్యలో ఒక మంత్రి నిబంధన లకు విరుద్ధంగా ఏకంగా నాలుగు కిలోమీటర్లు రహదారిని ఏర్పాటుచేసి ఇసుకను తరలింపునకు పాల్పడ్డారు. ఇక్కడి నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు. వాస్తవానికి ఇసుక తరలింపును మహిళా సంఘాలకు కేటాయించి వారికి ఆదాయవనరుగా మార్చాలని నిర్ణయించారు. అయితే టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చక్రం తిప్పి, మహిళా సంఘాల పేరు తో బంధువర్గాన్ని రంగంలోకి దింపి పాలసీనే మార్చేశారు

దీంతో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఆ తరవాత ఇసుక విధానాన్ని ఉచితం చేశారు. ఇదే టీడీపీ నేతలకు వరంగా మారింది. అవసరాల కోసమంటూ నదీ పరివాహక ప్రాంతా ల్లో మధ్య నుంచి ఇసుకను తీసుకురావడం, అక్కడ నుంచి ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేసుకుని అమ్ముకోవడం పరిపాటిగా మారింది.  ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం పచ్చనేతలకు అవకాశం కల్పించ డం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమయింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి అంటూ వాటర్‌మ్యాన్ రాజేంద్రసింగ్, అనుమోలు గాంధీ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్జీటీ, ఏపీ ప్రభుత్వానికి ₹100 కోట్లు జరిమానా విధించింది. ఎన్నికల వేళ చంద్రబాబు ప్రభుత్వానికి పార్టీకి ఇది అత్యంత శరాఘాతంగా మారింది.

*ఒకవైపు ఇసుక దందా 
*మరోవైపు పోలవరం పేరిట వేల కోట్లు పక్కదారి 
*అడ్డువచ్చిన అధికారులపై దాడులకు తెగబడిన ప్రజాప్రతినిధులకు అండగా నిలిచిన ప్రభుత్వ పెద్దలు.. ఇవే ఏపీలో చంద్రబాబు పాలనను అంతం చేశాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 

పోలవరం ప్రాజెక్టు పనుల్లో మాయచేసి ఎన్నికల ప్రవాహాన్ని సులువుగా దాటేందుకు చంద్రబాబు వేసిన ప్లాన్ రివర్సయింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి కేం ద్రం 90 శాతం నిధులు ఇవ్వడమే కాకుండా ఆ పనులను కూడా పర్యవేక్షిస్తుంది. కానీ ఎన్డీయే లో భాగస్వామి అయిన చంద్రబాబు పట్టుబట్టి పనులను రాష్ట్రప్రభుత్వమే పర్యవేక్షిస్తుందంటూ ‘పోలవరం ప్రాజెక్టు అథారిటీ’ ని ఏర్పాటుచేశారు. 

అప్పటినుంచి తన కనుసన్నల్లోనే పనులను చేపడుతూ, కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఇష్టానుసారంగా పట్టిసీమ, ఇతర ప్రాజెక్టులకు మళ్లించారు. ఆయా ప్రాజెక్టు లతోపాటు, పోలవరం ప్రాజెక్టు పనుల్లోనూ పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని గుర్తించిన కేంద్రం ‘యుటిలైజేషన్ సర్టిఫికెట్లు’  ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. 
2018లోనే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తానని చెప్పినా, ఇంకా పూర్తికాకపోగా భారీఎత్తున అవినీతి జరుగడాన్ని ప్రజలు గమనించారు దాంతో పోలవరం రివర్స్ కొట్టింది. 
ఎంటీఆర్ స్వంతంగా పార్టీ అతి స్వల్ప సమయంలో నిర్మించి ఒంటరిగానే ఎన్నికల్లో గెలిచారు – మామ నుండి వారసుడుగా వెన్నుపోటు రాజకీయంతో అధికారంలోకి వచ్చిన చంద్ర బాబు ఎప్పిడూ ఎన్నికల్లో పొత్తులతోనే గెలిచారు. తొలిసారి పొత్తుల్లేకుండా ఎన్నికల గోదాలోకి  దిగిన టీడీపీకి ఏపీ ప్రజలు చావుదెబ్బ కొట్టారు.  

రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకొనే టీడీపీ అధ్యక్షుడు బాబు ఎన్నికల్లో ఏదైనా పార్టీతో పొత్తు ఉంటేనే కానీ బరిలోదిగేవారు కాదు. ఆయన ఏనాడూ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలూ లేవు. ఎన్నికలు అనగానే పొత్తుల కోసం చూడడం ఆయనకు అలవాటు అది టిడిపి సాంప్రదాయం కూడా.  వెన్నుపోటు రాజకీయాల నేపథ్యంలో ఎన్టీఆర్ నుంచి సీఎం సింహ పీఠిని కబ్జా చేసిన చం ద్రబాబు నేతృత్వంలోని టీడీపీ 1999లో ఎన్నికలకు వెళ్లింది. అప్పుడు బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు వాజపేయి ప్రభతో గట్టెక్కారు. 

అలిపిరి ఘటనతో ఎన్డీయేతో పాటు ముందస్తుకు వెళ్లి 2004లో బొక్కా బోర్లాపడ్డారు. 2009 ఎన్నికల్లో మహాకూటమితో కలిసి బరిలోకి దిగినా అధికారం దక్కలేదు. విభజిత రాష్ట్రం లో 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, పవన్‌కల్యాణ్‌తో మిత్రత్వం నెఱపి విజయం సాధించారు. ఏన్నికలలో స్నేహం చేసి అధికారం లోకి వచ్చాక తిండాట ఆదే చంద్రబాబుతో 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని ఏపార్టీ పొత్తుపెట్టుకోవడానికి ముందుకు రాకపోవడంతో తొలిసారిగా ఒంటరిగా బరిలో దిగారు. అదను చూసి ప్రజలు ఘోరంగా టిడిపిని తుదవరకు ఓడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: