వందగొడ్లని తిన్న చంద్రబాబు - చీరాల రాజకీయం గాలివాన దెబ్బకి డిజాస్టర్ !!

KSK

వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివాన కి చచ్చింది అంటారు .. ప్రస్తుతం ఆ రాబందు చంద్రబాబు అయితే ఆ గాలివాన ఆమంచి కృష్ణ మోహన్ అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పండితులు విశ్లేషణ లు చేస్తున్నారు. పోలిటికల్ మూడ్ లో ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా గత సంవత్సర కాలం గా బిజీ గా ఉన్నాయి. దాదాపు ఏడాది క్రితం నుంచే అందరికీ పోలిటికల్ మూడ్ వచ్చేసింది ..



తెలంగాణా లో ఎన్నికలు జరిగితే ఏపీ జనాల్లో కూడా ఆసక్తి రేగింది. అక్కడ కాంగ్రెస్ తో కలిసి తాను మునిగి , కాంగ్రెస్ ని కూడా ముంచిన చంద్ర బాబు ఏపీ లో తాయిలాల గోల మొదలు పెట్టారు డిసెంబర్ నుంచే. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణం లో చంద్రబాబు అపజయాన్ని ఊహించి కావచ్చు, టీడీపీ లో ఉన్న ఇబ్బందుల వల్ల కావచ్చు చాలామంది టీడీపీ కి గుడ్ బై చెప్పడం చూశాం. టీడీపీ కి పర్ఫెక్ట్ ప్రత్యామ్న్యాయ పార్టీగా మారిన వైకాపా వైపు తరలి వెళ్లారు. అందరూ రావడం ఒక ఎత్తు అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ - వైకాపా లకి ధీటుగా ఇండీపెండెంట్ గా నిలిచి గెలిచి చంద్రబాబు లాంటి వ్యక్తి కే చుక్కలు చూపించిన ఆమంచి కృష్ణ మోహన్ ఒక ఎత్తు.




కాపు సామాజికవర్గ బలమైన నాయకుడు కావడం తో ఆమంచి రాక తో ఆంధ్రా మొత్తం వైకపా కి సరికొత్త ఊపు వచ్చింది. ముఖ్యంగా నెల్లూరు , ప్రకాశం , గుంటూరు జిల్లాలలో ఇప్పటి వైకపా ప్రభంజనానికి ఆమంచి వైకాపా ఎంట్రీ నే కారణం అని విశ్లేషకులు క్లియర్ గా చెబుతున్నారు. ఆమంచి ఎంట్రీ వరకూ ఒక ఎత్తు అయితే వైకాపా లోకి ఎంటర్ అయ్యి టీడీపీ యొక్క స్కాముల ని , కరప్షన్ నీ , కుల రాజకీయాలని లెక్కగట్టి మరీ చంద్రబాబు కి జగన్ రేంజ్ శత్రువు గా మారిన ఆమంచి మీద చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు.




ఎంతగా అంటే రాష్ట్రం లో గెలిచినా గెలవకపోయినా పక్కన పెడితే వైకాపా చీరాలలో గెలవకూడదు, ఆమంచి ఓటమే లక్ష్యంగా బాబు పావులు కడిపారు. ఆమంచి పార్టీ మారిన 8 గంటల్లో జిల్లా మొత్తం పోలీస్ ఎంత్రాంగం మార్చేశారు. అతి తక్కువ టైమ్ లో పోలిటికల్ వ్యాక్యూమ్ ని క్లియర్ చెయ్యడం కోసం ఎందరినో కొనేశారు , హేమా హేమీలని రంగంలోకి దింపారు , కారణం బలరాం తో తన స్థాయి ఎంతో చూపించే ప్రయత్నం చేశారు.




చీరాల జనాల టాక్ ప్రకారం దాదాపు గా చీరాలలో ఆమంచి ని ఓడించడం కోసం ఎనభై కోట్లు ఖర్చు పెట్టారు అంటే చంద్రబాబు లోని అభద్రతా భావం అర్ధం చేసుకోవచ్చు .. తన దృష్టి మొత్తం చీరాల మీద పెట్టుకుని రాష్ట్రం లో బొక్కబోర్లా పడ్డాడు చంద్రబాబు అంటున్నారు విశ్లేషకులు. అనుకూలంగా మారని వారి మీద దాడులు కూడా చేయించారు అనే తీవ్ర ఆరోపణలు చీరాల లో వినపడుతున్నాయి.




ఆఖరి ఇరవై రోజులు జనం లో ఉన్న స్వల్ప వ్యతిరేకత ని మీడియా సహాయం తో పూర్తి నెగెటివ్ గా తీసుకు వెళ్ళడం , ఛోటా మోటా నాయకులని చంద్రబాబు పర్సనల్ గా కలవడం అనేది రాష్ట్ర చరిత్ర లోనే ఎక్కడా చూడని అంశాలు గా చెప్పచ్చు. తాను టీడీపీ లో ఉన్నంత కాలం టీడీపీ ని బలపరిచి బయటకి రావడం కూడా కృష్ణ మోహన్ కి నెగెటివ్ అయ్యింది. చంద్రబాబు ప్రవేశ పెట్టిన పసుపు కుంకుమ , హౌసింగ్ స్కీమ్ లలో జరుగుతున్నా అవినీతి కారణం గా బయటకి వచ్చి బాబు మీద తిరిగబడిన ఆమంచి మీద దృష్టి పెట్టిన చంద్రబాబు తన సర్వస్వాన్నీ కోల్పోయాడు .. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: