ప్రత్యేక హోదానే ప్రధమ లక్ష్యం..నేడు మోదీతో జగన్ భేటి!

Edari Rama Krishna
ఏపిలో ఎన్నికల ఫలితాల్లో అఖండ విజయం అందుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పలువురు అధికారులు..నేతలు..సినీ తారలు అభినందిస్తున్నారు.  నిన్న ఆయన హైదరాబాద్ వచ్చి గవర్నర్ ని కలిశారు.  ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు వెళ్లారు.  జగన్ ఆయన సతీమణి భారతిని సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇంటి సభ్యులు సాదరంగా ఆహ్వానించి గౌరవించారు. 

ఇక నరేంద్ర మోదీతో  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం జరగనున్న విషయం తెలిసిందే.  వైఎస్ జగన్ వెంట వెళ్లిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి , వైఎస్ జగన్ వెంట వెళ్లిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నందిగం సురేశ్, భరత్, బాలశౌరి , ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలపబోతున్నారు.

వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన వైఎస్ జగన్ , రాష్ట్రంలోని సమస్యలను ప్రధానికి వివరించిన వైఎస్ జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి  వైఎస్ జగన్ విజ్ఞప్తి  రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను సత్వరమే నెరవేర్చాలన్న వైఎస్ జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించి కేంద్రం సాయమందించాలని కోరన వైఎస్ జగన్


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: