ఐటీ-గ్రిడ్స్ కేసులో కొందరికి షాకింగ్: ఏపీ ఐబి చీఫ్‌గా స్టీఫెన్‌ రవీంద్ర?

తెలంగాణాలో బయటపడ్డ ఏపి, తెలంగాణా ప్రజల డేటా చోరీ కేసును డీల్ చేస్తున్న హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర,  గతంలో రాయలసీమ రేంజ్‌ ఐజీగా విధులు నిర్వర్తించారు, యాంటీ టెర్రరిష్ట్ యాంటీ మావోయిస్ట్ స్కాడ్స్ లో పనిచేసిన అనుభవం అపారం. ఏపి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన అనుభవం ఉంది. 


వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం వైయస్ జగన్మోహనరెడ్డిని స్టీఫెన్ రవీంద్ర అమరావతిలోని వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.  


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్‌ రవీంద్ర పేరు తెరపైకి వచ్చింది. ఆయన పేరు దాదాపు ఖాయమైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్‌ రానున్నట్లు తెలుస్తోంది. స్టీఫెన్ రవీంద్ర పోలీస్ శాఖలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. 


వైయస్ రాజశేఖరరెడ్డి వద్ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్న తరుణంలో ఆయన కుటుంబం సభ్యులతో  సత్సంబంధా లను కలిగి ఉండేవారు


ఇప్పటికే ప్రస్తుత డీజీపీ ఆర్‌ పి ఠాకూర్‌ను తప్పించి ఆయన స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ను నియమించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు రాను న్నాయి. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసు శాఖపరంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇందిరా గాంధీ పురపాలక మైదానం  విజయవాడలో శనివారం సాయంత్రం ఆయన సందర్శించి అధికారులతో సమీక్షించారు. 


స్టీఫెన్ రవీంద్రను ఏపీకి పంపే విషయంపై ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ తో వైయస్ జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టీఫెన్ రవీంద్ర వైయస్ జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.  


గతేడాది జులై 1న ఆర్‌.పి.ఠాకూర్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 11నెలలుగా పదవిలో కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో సవాంగ్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: