హతవిధీ: బాలయ్య కూడా పేద రైతుల భూములు ఇలా ?

Satya
సినిమాల్లో హీరో. కంటి చూపుతో  శత్రువులను చంపేస్తాడు. అరవీర భయంకరుడు. పేదల పట్ల జాలీ, అభిమానం చూపుతాడు. వారి మీదకు ఎవరైనా వస్తే చాలు యుధ్ధాలే చేస్తాడు. మరి అటువంటి హీరో రియల్ లైఫ్ లో చేస్తున్నదేంటి. అసలు ఆ స్టోరీ ఏంటి..


బావ ముఖ్యమంత్రి కదా అని బాలయ్య బాబు ఇలా పేదోళ్ళ భూములను తన చుట్టాలైన బినామీల పేరు మీద  కారు చౌకగా కొనేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇపుడవవి కోట్లకు పడగలెత్తాయని భోగోట్టా. క్రిష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంత్రి గ్రామంలో బాలయ్య కొన్న భూములు 498.83 ఎకరాలు, ఆ భూముల కొన్న విలువ  4.98 కోట్లు, మరిపుడో ఏకంగా 300 కోట్లు దాటేశాయని తెలుస్తోంది.  అంటే పేదల భూములు పెద్దలకు ఇలా చేరాయన్నమాట.


ఈ భూములను తన బినామీ పేర్లుగా ఎంవీఎస్ రామారావు పేరిట కొనుగోలు చేసి ఆ తరువాత వాటిని విశాఖ బాటిలింగ్ కంపెనీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇచ్చారు. తరువాత వీటి విలువ పెంచడానికి వాటిని సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చారు. అంటే సర్కార్ చేతుల్లో ఉంది కదా అని అప్పనంగా భూములను కొనేసి వాటి విలువను అమాంతం పెంచేసుకుని మల్టీ మిలియనీర్లు అయ్యే ప్లాన్ అన్న మాట. మరి హీరో గారే ఇలా చేస్తే ఎలా. ఇపుడు ఈ భూ భాగోతం పైన కొత్త సర్కార్ గట్టిగా ద్రుష్టి పెడుతోందని అంటున్నారు. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: