నిఘా నీడలో నార్త్-బ్లాక్ - 2019-20 నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్ కసరత్తు ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టాక తొలి బడ్జెట్‌ ను జులై-5 న పార్లమెంటులో ప్రవేశపెట్ట బోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఇటీవల బాధ్యత లు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఆ రోజున లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పిస్తారు. ముందు రోజు జులై 4న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 1 న పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు


జులై 5న పార్లమెంట్‌ లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) గాను పూర్తి వార్షిక బడ్జెట్‌ ను ప్రకటించనున్నది. ఈ క్రమంలో నార్త్-బ్లాక్‌ లో బడ్జెట్ కసరత్తు మొదలవగా, సమాచారం బయటకు లీక్ అవకుండా నెల రోజుల పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, ఉద్యోగులను దిగ్భందంలో నిఘా నీడన ఉంటారు. వీరంతా ఇక అక్కడి ఆఫీసు లకే పరిమితం కానున్నారు. బడ్జెట్ ప్రకటన తర్వాతే వీరిని బయిట కు పంపిస్తారు. మీడియాకు గానీ, మరెవరికీ గానీ ప్రవేశం లేదు. బడ్జెట్ రహస్యాలను కాపాడటం లో భాగంగా ఏటా జరిగే తంతే ఇది.  ఇప్పటికే ఉద్యోగులందరి సెలవులు రద్దవగా, పైస్థాయిలో ఉన్న అత్యంత ఉన్నతాధి కారు లు మాత్రమే ఇండ్లకు వెళ్లే అవకాశముంది.


కొత్త ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈసారి వార్షికబడ్జెట్‌ను ప్రకటించనుండగా, దేశ వృద్ధిరేటు ఐదేండ్ల కనిష్ఠాన్నితాకిన నేపథ్యంలో ఎలాంటి ప్రకటనలు ఉంటాయో? నని వ్యాపార, పారిశ్రామిక వర్గాలు ఎంతో ఆసక్తి తో ఆదుర్దాతో ఎదురు చూస్తున్నాయి.


సీతారామన్ బడ్జెట్ బృందంలో ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్, ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ లతోపాటు ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, వ్యయ కార్యదర్శి గిరీశ్ చంద్ర ముర్ము, రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, దీపం కార్యదర్శి అతను చక్రబర్తి, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్‌ లు ఉన్నారు. జూన్ నెల 17నుంచి మొదలయ్యే 17వ లోక్‌సభ తొలి సమావేశాలు వచ్చే జూలై నెల 26 వరకు జరుగనున్నాయి. చాలా వరకు కంప్యూటర్లను నియంత్రణలో అంతర్జాలంతో అనుసంధానం లేకుండా ఉంచి భద్రతా సిబ్బంది, ఢిల్లీ పోలీసులు, ఇంటిలిజెన్స్ బ్యూరో కఠిన పహారాలో బడ్జెట్ పనులు జరురుపు తారు.


బడ్జెట్ రూపకల్పన నేపథ్యంలో నార్త్-బ్లాక్‌ను నిఘా వలయంలో ఉంచారు. ఆర్థికశాఖ కార్యాలయంలోకి వచ్చిపోయే వారు, చుట్టు పక్కల ప్రాంతాల్లో వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇంటెలిజన్స్ బ్యూరో అధికారులు, డిల్లీ పోలీసులు నిరంతర నిఘా విధుల్లో పాలుపంచు కుంటున్నారు. అలాగే బడ్జెట్‌ కు సంబంధించిన కీలక అంశా లేవీ బయటకు లీక్ కాకుండా మునుపటి లాగానే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థికశాఖలోని పలు కంప్యూటర్లకు ప్రైవేటు ఈ-మెయిల్ ఏర్పాట్లస్ను బ్లాక్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: