సీఎం జగన్ షాకింగ్ డెసిషన్: పాత అధికారులు కొత్త మంత్రుల వద్ద పనికి "నో-ఛాన్స్"

బలమైన వేగు వ్యవస్థ కలిగి ఉన్న పార్టీగా టిడిపి ప్రజల్లో పేరుంది. ముఖ్యంగా ఈ పార్టీకి ఉన్న బహు ముఖ ప్రయివేట్ సమాచార వ్యవస్థ - (మల్టీఫేసెట్డ్ ప్రైవేట్ మీడియా)   తెలుగు ప్రజలే కాదు ముఖ్యమంత్రి తరచుగా వాడే దాని మరో పేరు ఎల్లోమీడియా తో ఉన్న అతి దగ్గర సంభందాల కారణంగా దానిని అల్లుకొని ఈ వేగువ్యవస్థ రూపుదిద్దుకుందని అంటుంటారు. వీరు వారు - వారు వీరు అనే బేధం లేకుండా వారంతా మంత్రుల సలహా మండళ్ళు, వారి కార్యదర్శులను అంటిపెట్టుకొని ఉంటున్న దాఖలాలు గత ఐదేళ్ల నుండి ప్రజలకు చిరపరిచితమే.



కొన్ని సందర్భాల్లో సచివాలయంలో కొందరు ఎల్లో మీడియా ప్రతినిధులు కూర్చొని అధికారులతో మంత్రులతో కావలసిన పనులు చేయించుకునే వారని రూమర్స్ ఉన్నాయి. 


అందుకే ఆంధ్రప్రదేశ్ నూతన యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రుల దగ్గర పనిచేసే అధికారుల విషయంలో ఒక కఠినతర నిర్ణయం తీసుకున్నారట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో, వైఎస్ జగన్ విజయఢంకా మోగించి అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజల్లో ఏడాదికిపైగా మమేకమై తిరిగి అధికారంలోకి వచ్చిననాటికే గత ప్రభుత్వ లీలలు తెలిసిన వైఎస్ జగన్ ఎక్కడెక్కడ జాగ్రత్తలు అవసరమో గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అంతెందుకు మొన్నటికి  మొన్న సచివాలయం లో తొలిసారి ప్రవేసించిన సందర్భంలో పూజలు నిర్వహించి వైఎస్ జగన్మోహనరెడ్డిని ఆశీర్వదించిన పూజారుల్లో తెదేపా కి అతి సన్నిహితుడైన లాయర్ ఒకరు పూజారిగా వచ్చారని సమాచారం.

అదేనిజమైతే ఇందు కుటిల  కౌటిల్య వ్యూహం ఏమైనా ఉందా! అనేది అణువణువూ శోధించిమాత్రమే పనులు చక్కబెట్టు కోవటం అవసరం - అది సెక్యూరిటీ పరంగానో, ఇంటెలిజెన్స్ పరంగానో జరగాలి. లేదా ఇలాంటి వెగులపై తన పార్టీలోని నమ్మకస్తులతో  ప్రతిక్రియ చేయగల ప్రత్యేక వ్యవస్థను తానే నిర్మించుకోవటం అత్యవసరం.  


ప్రజలకు మంచి పాలన అందించడంతో పాటు, తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రతిపక్షాలకు ముందుగా తెలిసి పోకుండా ఉండేందుకు తాజాగా ఒక నిర్ణయం తీసు కున్నారట. గత ప్రభుత్వంలో మంత్రుల దగ్గర పనిచేసిన అధికారులను, ఉద్యోగులను నూతన మంత్రులకు సుదూరంగా ఉంచాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రుల దగ్గర పనిచేసిన అధికారులను కొత్తమంత్రుల దగ్గర అవకాశం ఇవ్వడంలేదని తేల్చిచెప్పారు. ఏపీ మంత్రుల వ్యక్తిగత సిబ్బంది నియామకాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. సిబ్బంది నియామకం విషయంలో సీఎం జగన్ అనుమతి తీసుకోవా లని, మంత్రులకు ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం లేఖ రాశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: