లోక్ సభ - రాజ్యసభల్లో టిడిపి నిశ్శబ్ధంగా మాయం? సొదిలో లేని చంద్రబాబు!

తెలుగుదేశం పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రజా ప్రాతినిద్య సభల్లో అంటే లోక్ సభ రాజ్య సభ ల్లో నుంచి మాయం అవనుందా?  ఏపి రాష్ట్ర శాసనసభ లో క్రమంగా క్షీణించనుందా? ప్రస్తుతం అటు డిల్లీలో ఇటు అమరావతి లో నెలకొన్న పరిస్థితులు ఈ ప్రశ్నలకు తావిస్తున్నాయి. ప్రస్తుతం టిడిపి అధినేత ధారుణ పరాజయంతో పాటు ధారుణ పరాభవం మూటగట్టుకున్నారు. ప్రస్తుతం తాను తన తనయుడు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనలో ఉన్నారు. 

అయితే ఇదే సమయంలో రాజ్యసభలో తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరుతూ గురువారం సాయంత్రం టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు సుజనాచౌదరి,  సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావులు  రాజ్యసభ ఛైర్మెన్ ముత్తవరపు వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. రాజ్యసభ లో ఆరుగురు టీడీపీ ఎంపీలు ఉన్నారు. నలుగురు ఎంపీలు తమ ను  ఇకపై తమను టీడీపీ సభ్యులుగా కాకుండా ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని వెంకయ్యను కోరారు. అనర్హత వేటు పడ కుండా ఫిరాయింపు ఎంపీలు కొత్త ఎత్తు వేశారు. తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలంటూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యకి లేఖ రాశారు.  ఈ నలుగురు ఎంపీలు ఇకపై బీజేపీ అనుబంధ సభ్యులుగా కొనసాగనున్నారు.



మిగిలిన వారిలో తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్ర కుమార్ మాత్రం ప్రస్తుతం టీడీపీ వైపు ఉన్నారు. రాజ్యసభ సభ్యులు పార్టీ వీడటంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను చంద్రబాబు తప్పుబట్టారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ బీజేపీతో పోరాడిందన్నారు. పార్టీకి సంక్షోభాలు కొత్త కాదన్నారు. నేతలు, కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ టీడీపీలో సంక్షోభం నెలకొంది. పార్టీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి వెళ్లిపోయారు. నలుగురు సభ్యులు టీడీపీని వీడటంతో రాజ్యసభలో ఆ పార్టీకి ఇక మిగిలింది ఇద్దరు ఎంపీలే. దీంతో టీడీపీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోనుంది.రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే ఇప్పుడు టీడీపీకి చెందిన ముగ్గురు లోక్‌సభ ఎంపీలు  స్పీకర్‌ను కలిశారు. రాజ్యసభలో నలుగురు ఎంపీలు తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని రాజ్యసభ చైర్మెన్‌కు లేఖ ఇచ్చిన తరుణంలో ముగ్గురు ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని కూడ లోక్‌సభ స్పీకర్‌ ను కలవాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. 

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైన తర్వాత మర్యాద పూర్వకంగానే కలిసినట్టుగా టీడీపీ ఎంపీలు చెబు తున్నారు.  కానీ, రాజ్యసభలో నలుగురు ఎంపీలు ప్రత్యేక వర్గంగా గుర్తించాలని లేఖను ఇచ్చిన సమయంలో  లోక్‌సభ స్పీకర్‌ను ఈ ముగ్గురు ఎంపీలు కలవడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీ పార్లమెంట్ పార్టీ సమావేశం తర్వాత చంద్రబాబునాయుడు తీసుకొన్న నిర్ణయాలపై కేశినేని నాని  తీవ్రంగానే స్పందించారు. అంతేకాదు లోక్‌సభలో టీడీపీ విప్ పదవిని తిరస్కరిస్తున్నట్టుగా కేశినేని నాని ప్రకటించారు.



వరుసగా మూడు సార్లు తన ఫేస్‌బుక్ లో కేశినేని నాని  పోస్టులు పెట్టారు.  పార్టీ నాయకత్వం తీసుకొన్న నిర్ణయాలపై కేశినేని నాని తీవ్రంగా మనస్థాపానికి గురైనట్టుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయమై చంద్రబాబు నాయుడు చర్చించినా కూడ కేశినేని నాని మాత్రం చల్లబడలేదు. పార్టీ నాయకత్వంపై కేశినేని నాని  అసంతృప్తి తో ఉన్నారు. వ్యాపార వేత్తగా ఉన్న గల్లా జయదేవ్‌ పై ఒత్తిడి ఉండే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇక రామ్మోహన్ నాయుడు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారని తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో  ఈ ముగ్గురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలవడమే పలు అనుమానాలకు తావిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.


రాజ్యసభలో బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో తమకు మద్దతిచ్చే ఏ ఒక్క ఎంపీని, పార్టీని వదులు కునేందుకు బీజేపీ ఇష్టపడటం లేదు. తమకు మద్దతిస్తామనే వాళ్లని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ 123. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం 75.  ప్రస్తుతం నలుగురు ఎంపీలు ఖాళీ అయ్యారు. అమిత్ షా, స్మృతీ ఇరానీ లాంటి వాళ్లు రాజ్యసభ నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలిచారు.


ఎన్డీయే సంఖ్యా బలం 102గా ఉంది. 123 కావాలంటే ఇతర సభ్యుల మద్దతు కూడా కావాలి. కీలక బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాలంటే రాజ్యసభలోనూ మెజార్టీ కావాలి. అందుకే ఇతర పార్టీల ఎంపీలను తమవైపు మళ్లించుకునే దిశగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. బీజేపీలోకి వస్తామంటే స్వాగతం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: