ఆ"కుల" రాజకీయ మార్పులు చేర్పులు

SEEKOTI TRIMURTHULU
- మరలా బీజేపీ లో చేరేయోచనలో పవన్‌పై ఘాటు విమర్శలు
పార్టీ మారేది లేదంటూనే 2019 ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి జనసేన పార్టీకి మారిన రాజమహాంద్రవరం మాజీ ఎంపీ ఆకుల సత్యనారాయణ మరోసారి అదే మాట చెబుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ సామాజిక వర్గానికి చెందిన ఆకుల సత్యనారాయణ రాజమహాంద్రవరం నుంచి ఇటీవల పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆకుల బీజేపీలోకి వెళ్తారని కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.


ఈ నేపధ్యంలో తనకు వేరే పార్టీలోనికి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేస్తూ పవన్‌ కళ్యాణ్‌పై ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజల్లోకి వెళ్లడంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యారన్నారు. అసలు జనసేన కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా ...పవన్ జనం మధ్య ఉంటారలో లేదో కాలమే చెప్పాలి. కులసమీకరణాలతో రాజకీయం చేస్తే భంగపాటు తప్పదంటున్నారు మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ నేత ఆకుల సత్యనారాయణ. కొద్దిరోజులుగా పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. తాను పార్టీ మారనంటూనే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


వచ్చే ఐదేళ్లలో పవన్‌ ప్రజల్లో ఉంటారో లేదో కాలమే నిర్ణయిస్తుందన్నారు. జనసేన విధానాలు, తన ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారన్నారు. నిజం చెప్పాలంటే జనసేన కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా అంటూ ప్రశ్నించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు ఈ ఐదేళ్లు ప్రజల మధ్య ఉంటాడో లేదో అన్నది కాలమే చెప్పాలన్నారు. నిరంతరం ప్రజల మధ్యలో ఉండే.. ప్రజల ఆకాంక్షకు తగ్గట్లు పనిచేస్తే అప్పుడు ప్రజల తీర్పును బట్టి ఉంటుందని అభిప్రాయపడ్డారు. 


ఎన్నికల్లో తనకు రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండా లక్షా 58 వేలు ఓట్లు వేశారన్నారు ఆకుల. ఏపీ ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతో ప్రజలు ఓటేసినట్లు కనిపిస్తోందన్నారు. వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేనలు మాత్రమేనని.. టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి కోలుకునే పరిస్థితి ఉండదని జోస్యం చెప్పారు. పార్టీ మారే ఆలోచన లేదన్నారు ఆకుల.. ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: