ఎడిటోరియల్ : చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా ?

Vijaya

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బిజెపి ఏపి ఇన్చార్జి సునీల్ ధియోధర్ మాట్లాడుతూ రెండేళ్ళల్లో చంద్రబాబు అరెస్టు ఖాయమని అనటం వెనుక పెద్ద స్క్రిప్ట్ రెడి అవుతున్నట్లే అనుమానంగా ఉంది. పైగా టిడిపి నాయకుడు లేని పార్టీ అయిపోతుందని జోస్యం కూడా చెబుతుండటం గమనార్హం.

 

ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత నరేంద్రమోడి టార్టెట్ గా చంద్రబాబు చాలా ఓవర్ యాక్షనే చేశారు. తన చేతకానితనాన్ని మోడిపైకి నెట్టేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి నుండి జనాల దృష్టి మళ్ళించేందుకు మోడిని అడ్డుపెట్టుకున్నారు.

 

ఇక ఏపిలో ఎన్నికలైపోయిన తర్వాత తగుదునమ్మా అంటూ తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మోడి వ్యతిరేక ప్రచారం చేశారు. కాకపోతే చంద్రబాబు దరిద్రమేమిటంటే మళ్ళీ రెండోసారి కూడా మోడినే ప్రధానమంత్రయ్యారు. పైగా ఎన్టాఏ-1 కన్నా ఎన్డీఏ-2 లో ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చింది.

 

అప్పటి నుండి చంద్రబాబు టార్గెట్ గా మోడి పావులు కదపటం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో అపారమైన ప్రాధాన్యత ఇవ్వటం మొదలైంది. జగన్ అడగ్గానే అప్పటి వరకూ పెండింగులో ఉన్న కొన్ని శాఖల నిధులను వెంటనే రిలీజ్ చేసేశారు.

 

పనిలోపనిగా రాజకీయంగా కూడా చంద్రబాబును దెబ్బ కొడుతున్నారు. టిడిపికి చెందిన 4 రాజ్యసభ ఎంపిలను లాగేసుకున్నారు. ఎంఎల్ఏల్లో కూడా చీలక తేవటం కోసం ప్రయత్నిస్తున్నారు. ముందుగా రాజకీయంగా దెబ్బకొట్టి తర్వాత చంద్రబాబు మీదున్న అవినీతి కేసుల విషయాన్ని చూడాలని అనుకున్నారట. అందుకనే ఏరికోరి తనకు బాగా సన్నిహితుడైన సునీల్ ధియోధర్ ను ఏపికి ఇన్చార్జిగా నియమించారు. చూడబోతే సునీల్ చేసిన ప్రకటన ఆమల్లోకి వచ్చేట్లే ఉంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: