ఆశల పల్లకిలో ఆశక్తి గా నవ భారతం! నిర్మల బడ్జెట్ పై మన్మోహన ముద్ర ఉంటుందా!



నిర్మలా సీతారామన్ - రక్షణశాఖను సమర్థంగా నిర్వహించారు. ఆమె ప్రదర్శించిన ఆ సామర్ధ్యమే ఇప్పుడు భారత ఆర్ధిక  హయం పగ్గాలు చేపట్టారు.  ఆమె సామర్ధ్యం తెలిసిన భారతీయులు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆమె ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెట్ట బోతున్నారు అనే దానిపై అందరూ ఆశక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా భారతీయ ప్రముఖ ఆర్ధికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను బడ్జెట్ కు ముందు నిర్మల కలవటం ముదావహమే కాదు అందులో ఆమె విశ్వసనీయత కనిపిస్తుంది. 


ప్రస్తుతం దేశ వృద్ధిరేటు 5.8 శాతానికి పడిపోయింది. దాన్ని దౌడు తీయించాలంటే  రాయితీలు, భిన్న వ్యవస్థలకు విబ్బిన్న ప్రయోజనాలు బడ్జెట్‌లో ప్రకటించాలి. దేశం లో వ్యవసాయ రంగం ఓట్ల రాజకీయాల్లో పడి అత్యంత దీనావస్థలో కూరుకు పోయింది. రైతుల పరిస్థితి మరీ అత్యంత దారుణంగా తయారైంది. వాళ్లకు ఈ బడ్జెట్ లో తగిన ప్రోత్సాహ కాలు ఇవ్వకపోతే వ్యవసాయరంగం అధఃపాతాళానికి పడిపోవటం తధ్యం. 



యూపీఏ హయాంలో వ్యవసాయరంగం అభివృద్ధి 4.7 గా ఉండగా ప్రధానిగా నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్తాక 2014-2019 వరకూ, వ్యవసాయ రంగవృద్ధి రేటు 2.8 శాతానికి పడిపోయింది. ఇందులో నరేంద్ర మోడీ కారణం లేశ మాత్రమే కాగా ప్రకృతి వర్షాభావ పరిస్థితులు ప్రధాన కారణం. ప్రకృతి విపత్తులతో పాటు - నకిలీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు, దళారుల దోపిడీలు ఇలా రకరకాల కష్టాలు తోడై, రైతులు తీవ్ర నస్టానికి గురౌతున్నారు. ఇంతా చేసి పండించే పంటకు ‘మద్దతు ధర’ లభించట్లేదు సకాలంలో పంటల తరుణంలో వర్షాలుపడక సాగునీరందక రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. 


వర్షాభావపరిస్థితులు వ్యవసాయ రంగానికి పెనుప్రమాదమై కూర్చుంది. దేశంలో ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారం 60 కోట్ల మందికి తాగు నీరులేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ఇది నిజంగా 70 కోట్ల మందికి పెనుప్రమాదంగా పరిణమించిన దాఖలాలు ఉన్నాయి. నిరంతర సమస్యగా ఉన్నాయి. ప్రధాని కృషి యోజన, పంటల బీమా పథకం, ఆరోగ్య కార్డులు, ఈ-మండీ వంటివి రైతులకు పూర్తిస్థాయి ప్రయోజనం కలిగించ టానికి ఇంకొంత సమయం పట్టవచ్చు. 

దేశంలో దాదాపు 90 శాతం పైగా పెద్దా చిన్న రిజర్వాయర్లు అడుగంటి పోగా  450 పైగా ఉన్న నదుల జలాలు తాగడానికి
ఉపయోగపడటం లేదు. జల కాలుష్య తీవ్రత తో పాటు  గ్రమీణ ప్రాంతాల్లో 84 శాతం మంది తాగునీరు లేదా మంచి నీరు లభించటం దుర్లభమైపోతోంది. దేశంలో మనం తాగేనీటిలో 70శాతం వరకూ కలుషితమైనదే అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ముంబై మునిగిపోతోంది చెన్నై ఎండిపోతోంది. తాగు నీరు లేక జనాలుతిప్పలు పడుతుంటే, అటు కాలుష్య నియంత్రణ, జల సంరక్షణ కోసం బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు జరపవలసి ఉంది.


ఇక జాతీయ రహదారులు, గృహాలు, విధ్యుత్తు, నదుల అనుసంధానం వంటి మౌలిక సదుపాయాల పైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే నరేద్ర మోడీ పాలనా కాలంలో ప్రత్యేకించి 2018 లో రహదారుల అభివ్ర్డ్డికోసం ₹79000 కోట్లు కేటాయించారు. 2019 ఫిబ్రవరి నాటి మధ్యంతర బడ్జెట్‌లో దాన్ని ₹83000 కోట్లకు పెంచారు. తద్వారా దేశంలో రోజుకు 32 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందగా దాని వేగాన్ని 40 కిలోమీటర్ల వరకు పెంచటానికి కేంద్రం నడుంబిగించింది. ఈ విషయంలో బడ్జెట్ ప్రతిపాదనలు ఎలా ఉంటాయో అన్నది ప్రధానం. దేశంలో పారిశ్రామిక రంగం ఆశించిన ఫలితాలు ఇవ్వక దశాబ్ధాలకాలం గడుస్తుంది. చైనా లాంటి దేశంతో పోటీ పడుతూ మేకిన్ ఇండియా ప్రారంభించినా అది అనుకున్నంతగా ముందుకు సాగటం లేదు. 

భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతి బడ్జెట్ లోను ఆలోచనలకే పరిమితం అవుతోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు కల్పిస్తే, నిరుద్యోగ సమస్యకు కొంతైనా అడ్డుకట్ట వేయొచ్చు. అంతే కాదు దీనితో ఉత్పత్తి పెరిగి, విదేశీ ఎగుమతులుపెరిగి, ఫారిన్ కరన్సీ నిల్వలు పెరిగి కరెంటు ఎకౌంట్ లోటు తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా రూపాయి మారకపు విలువ పెరిగి, ఆర్థిక వ్యవస్థ మరింత బలపడే విషయాలు నిర్మలా సీతారామన్ పరిశీలనలో ఉన్నవేనని – అందుకే ఆమె ప్రకటించ బోయే బడ్జెట్ కొత్త పుంతలు తొక్కగలదా? రేపు శుక్రవారం (05.07.2019) కోసం ఏదురు చూద్ధాం.


ఇక బ్యాంకింగ్ రంగంలో వివిధ కారణాల వల్ల ప్రత్యేకించి అవినీతి పరులు, అక్రమ విధానాలు, అసమర్ధ నాయకత్వంతో ప్రభుత్వ అలసత్వం నిర్లక్ష్యంతో కృంగి కునారిల్లు తుంది. అందుకే ఆ వ్యవస్థలో ప్రభుత్వ ప్రమేయాన్ని నిరోధించి ఆమూలాగ్ర సంస్కరణలతో కీలక మార్పులు తేవాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రభుత్వ అజమాయిషీ లేని ప్రైవేట్ బ్యాంకులు చక్కగా అభివృద్ధి పథంలో నడుస్తుంటే ప్రభుత్వ అజమాయిషీలోని బ్యాంకులు నష్టాల్లో కునారిల్లటం శోచనీయం. దీనికి కారణం బ్యాంకింగ్ నియంత్రణ చేసే రిజర్వ్ బాంకు పై ప్రభుత్వం నుండి పెరిగిపోయిన వత్తిడి. అక్కడి అధికారులు తమ పదవులను వదిలేసి తప్పుకోవటం ప్రభుత్వ ప్రతిష్ట మసక బారున్నట్లే. 

ఏన్నికలలో గెలుపే ప్రధాన లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వాలు --- అందులోని అవకాశవాదులైన రాజకీయ నాయకులు తెచ్చే వత్తిడితో ఋణాలు ఇస్తూ, వాటిని తిరిగివసూలు చేసుకోలేకపోవటం అత్యంత అనర్ధ జాఢ్యంగా మారింది. గత రెండేళ్లలోనే బ్యాంకులు ఈ అక్రమ ఋణాలతో ₹75000 వేల కోట్లకు పైగా  నష్టపోయాయి. దీంతో ఎంతో ప్రతిష్టాత్మక బ్యాంకింగ్ రంగంపై ప్రజల్లో నమ్మకం సడలిపోతుంది. ఈ పరిస్థితి మారకపోతే, ఆర్థిక వ్యవస్థ కుదేలై దేశ ఆర్ధిక సార్వభౌమత్వాం పై మాయని మచ్చపడే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: