అంబికా కృష్ణ ఎవరి కూతురు ... కరుణం సమాధానం చెప్పాలి
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కరుణం బలరాం పై వైకాపా నేత , మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాటల దాడి ని తీవ్రం చేశారు . ఎన్నికల అఫిడవిట్ లో తన సంతానం గురించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన బలరాం అంబికా కృష్ణ ఎవరి కూతురో చెప్పాలంటూ ప్రశ్నించి, ఇరకాటం లోకి నెట్టే ప్రయత్నాన్ని చేశారు . ఎన్నికల అఫిడవిట్ లో కరణం బలరాం తప్పుడు సమాచారం ఇచ్చారని, కరణం బలరాంకు 4 గురు సంతానం అయితే ముగ్గురిగా పొందుపరిచారని ఆమంచి కృష్ణమోహన్ అన్నారు . ఈ విషయమై ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టించిన కరుణం బలరాం ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ , హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశానని చెప్పారు .
కాట్రగడ్డ ప్రసూన, బలరాంలకు అంబికా కృష్ణ అనే కూతురు ఉందని , బలరాం తన అఫిడవిట్ లో అంబికా ను తన సంతానంగా పొందుపరచలేదన్న ఆమంచి కృష్ణమోహన్ , అంబికా కు బలరాం తండ్రి హోదాలో అన్న ప్రాసన దగ్గర నుండి 8 ఏళ్ళు వరకు పుట్టిన రోజులు కూడా చేశారన్నారు . సెయింట్ థెరిసా హాస్పిటల్ ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్ లో కూడా తండ్రిగా బలరాం పేరే ఉందని చెప్పారు . అన్ని సర్టిఫికెట్స్ లో అంబికా కు బలరాం తండ్రి అని ఉన్నప్పటికీ , అంబికా తన కూతురు కాదు అని బలరాం అంటే కనుక ఏ పరిక్షకైనా అంబికా సిద్ధంగా ఉన్నారన్నారు .
ఫోరెన్సిక్, డి ఎన్ ఏ వంటి సైoటిఫిక్ పరీక్షలకు కూడా అంబికా సిద్ధముగా ఉన్నట్లు , తన తండ్రి ఎవరు అనేది ప్రపంచానికి చెప్పాలన్నదే అంబికా కోరికని ఆమంచి పేర్కొన్నారు . అంబికా కు న్యాయం చెయ్యాలని నేను ప్రయత్నిస్తున్నాఎన్.. పదవుల కోసం కాదని చెప్పారు . అంబికా ఎవరనేది చంద్రబాబు కి బాగా తెలుసునని .. బలరాం కుమార్తె గా గతంలో ఆమె రాసిన పుస్తకాన్ని మాజీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారన్నారు . కన్న కూతురి పేరుని అఫిడవిట్ లో పెట్టని కఠినమైన వ్యక్తి బలరాం అని, విలువల గురించి మాట్లాడే చంద్రబాబు, తక్షణమే బలరాం ను పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు .