పశ్చాత్తాపంలో తెలుగు తమ్ముళ్ళు...గ్రామాలలో టీడీపీ ఖాళీనే..???

NCR

2019 ఎన్నికల ముందు వరకూ తెలుగు దేశం పార్టీలో కార్యకర్తలు, తృతీయ శ్రేణి నాయకులు , వార్డ్ మెంబర్లు మొదలు, పంచాయతీ స్థాయి వరకూ కూడా ప్రతీ ఒక్క టీడీపీ కార్యకర్త తాము అధికారంలో ఉన్న సమయంలో ఎలా వ్యవహరించామో తలుచుకుని కుమిలి పోతున్నారట. తాము చేసిన తప్పులకి పశ్చాత్తాప పడుతున్నారట. సీయం జగన్ లా మేము వ్యవహరించి ఉండుంటే  అధికారంలోకి వచ్చి ఉండే వాళ్ళమేమో,  రాకపోయినా కనీసం ప్రజల నుంచీ సానుభూతి అయినా వచ్చేది కానీ ఇప్పుడు కనీసం తమవైపు కన్నెత్తి కూడా చూడటంలేదు అంటూ కుమిలిపోతున్నారట.

 

మొన్నటి వరకూ ప్రజలతో, కార్యకర్తలతో కళకళలాడిన తమ కార్యాలయాలు, ఇళ్ళు జనాలు లేక బోసి పోతున్నాయని బెంగ పెట్టుకున్తున్నారట. ఇదిలాఉంటే ఎన్నికల ముందు నిమిషంలో వైసీపీ నుంచీ టీడీపీలోకి ఎదో ఒక కారణంతో వెళ్ళిపోయినా వారి పరిస్థితి అయితే మరీ ఘోరంగా మారిందట. మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉంది మా పరిస్థితి అంటూ బోరు బోరున విలపిస్తున్నారని తెలుస్తోంది.

 

తాము అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ కార్యకర్తలు, వైసీపీకి మద్దతుగా నిలిచిన ప్రజలు  తమ హక్కుగా ఉండే పధకాల విషయంలో ఆర్జీలు పెట్టుకున్నప్పుడు, తమ పార్టీ వాళ్ళు కాదని, వారి ఆర్జీలని వెనక్కి పంపిన సంగతులు మననం చేసుకుంటున్నారట. సీయం జగన్ మాత్రం మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు ఎవరు వచ్చినా సరే అర్హులకి పధకాలు అమలు చేయండి, ఏ నాయకుడైనా ఈ మూడు విషయాల్లో తారతమ్యం చూపిస్తే నేరుగా సీఎంవో కి ఫిర్యాదు చేయండి అని చెప్పడంతో చంద్రబాబు కి జగన్ కి మధ్య ఉన్న తేడాని గుర్తు చేసుకుంటున్నారని తెలుస్తోంది. జగన్ లా మనం కూడా ప్రజలకి ఇలాంటి భరోసా ఇచ్చి ఉంటే ఈ రోజు మనల్ని కనీసం పలకరించే వాళ్ళు ఉండే వాళ్ళు అంటూ బావురుమంటున్నారట. ముఖ్యంగా ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల నేతల్లో మరీ ఎక్కువగా ఉందని. తమ భవిష్యత్తు అంధకారంలో ఉందని ఈ పరిస్థితి నుంచీ బయట పడాలంటే వైసీపీలో చేరడం తప్ప మరే దారిలేదని భావిస్తున్న నేతలు  పంచాయతీ ఎన్నికల ముందుగానే వైసీపీలోకి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే కాబోలు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: