కేసీఆరా.. మజాకా..? భలే బిల్లు తెచ్చాడుగా..?
మరి అంతగా ఆకట్టుకునే అంశాలు ఏమున్నాయో చూద్దామా..? చట్టంలో పొందుపరిచిన కొన్ని ముఖ్యాంశాలు◆తెలంగాణ మున్సిపల్ చట్టం ద్వారా పూర్తి పారదర్శకత.◆అవినీతి రహిత పాలన కోసమే నూతన మున్సిపల్ చట్టం.◆ప్రజలకు మేలు చేసేలా కొత్త చట్టం రూపకల్పన.◆75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్ ఫీజు రూపాయి మాత్రమే.◆75 గజాల లోపు నిర్మించుకున్న ఇంటికి పన్ను రూ. 100
◆కార్యాలయానికి రాకుండానే 500 చదరపు మీటర్ల వరకు నిర్మాణాలకు అనుమతి.◆500 చదరపు మీటర్ల వరకు నిర్ణీత సమయంలో ఆన్లైన్లోనే అనుమతి.
◆యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలి.◆ఇంటి కొలతలు, ఇతర తప్పుడు సమాచారం ఇస్తే భారీగా జరిమానాలు.◆తప్పుగా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే 25 రెట్ల జరిమానా.◆అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండానే కూల్చివేత.
◆పట్టణాలు, పల్లెల్లోనూ గ్రీన్ కవర్ పాలసీ.◆కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీన్ కమిటీ ఏర్పాటు.◆హరితహారం లక్ష్యాలపై అశ్రద్ధ చేసే అధికారులు ఉద్యోగాల నుంచి తొలగింపు.★బాధ్యతలు నిర్వర్తించని ప్రజాప్రతినిధులపై చర్యలు★మొక్కలు నాటి సంరక్షించని సర్పంచ్, చైర్పర్సన్ల పదవులు తొలగింపు.★కొత్త చట్టం ద్వారా అధికారులు, ఉద్యోగులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం.★కొత్త చట్టంలో మరింత కీలకంగా జిల్లా కలెక్టర్ల పాత్ర.