జబర్దస్త్ వినోద్ పై దాడికి అసలు కారణం ఇదీ..!

Chakravarthi Kalyan

లేడీ గెటప్స్ వేసే జబర్దస్త్ నటుడు వినోద్ పై హత్యాయత్నం ఘటన కలకలం రేపింది. కాచిగూడలోని ఓ ఇంటిలో ఉంటున్న వినోద్ తనపై హత్యాయత్నం జరిగిందని వినోద్ పోలీసులకు పిర్యాదు చేశారు.ఇంటి యజమానే తనపై దాడి చేశారని ఆయన చెప్పారు.


ఎడమ కంటిపై తీవ్రంగా గాయపడ్డ ఆయన చికిత్స పొందుతున్నారు. అసలు ఇంతకీ ఈ హత్యాయత్నానికి కారణమేంటి.. దీనిపై వినోద్ చెబుతున్న వాదన ఇలా ఉంది. ప్రస్తుతం తాను అద్దెకు ఉంటున్న ఇంటిలో కొంత భాగం కొనుగోలు కోసం వినోద్ పది లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు.


సకాలంలో ఇల్లు అప్పగించాలని.. లేనిపక్షంలో అడ్వాన్స్ పది లక్షలకు మరో పది లక్షలు కలిపి మొత్తం 20 లక్షలు వినోద్ కు ఇస్తానని ఇంటి యజమాని బాలాజీ దస్తావేజులపై రాసి ఇచ్చారు. ముందుగా డబ్బు తీసుకున్నా.. ఇంటి యజమాని ప్రమిల, బాలాజీ ఇల్లు అప్పగించకుండా జాప్యం చేస్తున్నారు.


ఈ విషయంపై స్థానిక కార్పొరేటర్ ను వినోద్ ఆశ్రయించాడు. ఆయన కూడా వినోద్ పక్షమే మాట్లాడారు. దీని గురించి వినోద్ కక్ష పెంచుకున్న ఇంటి యజమాని.. భార్య, కుమారులతో కలసి తనపై దాడి చేసి చంపబోయారని వినోద్ చెబుతున్నాడు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని వినోద్ అంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: