జగన్ రోజూ ధరించే తెల్ల చొక్కా రేటెంతో తెలుసా..?

Chakravarthi Kalyan

వైఎస్ జగన్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయన హాట్ టాపిక్. ఆయన నిర్ణయాలు, పాలన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అనుభవజ్ఞుడైన చంద్రబాబు స్టయిల్ కు భిన్నంగా జగన్ పరిపాలన సాగుతోంది.


సీఎంగా జగన్ లుక్ కు ఆయన ఇటీవల ధరిస్తున్న తెల్ల చొక్కాలు మరింత అదనపు ఆకర్షణ ఇస్తున్నాయి. గతంలో వైఎస్ జగన్ రంగు రంగుల చొక్కాలు ధరించేవారు. ఏ రంగు చొక్కా ధరించినా.. అందులో సన్నగళ్లు ఉన్నవే మెయింటైన్ చేసేవారు.


ఆ తర్వాత ఆయన డ్రస్సింగ్ స్టైల్ మారింది. కొన్నాళ్లుగా జగన్ తెల్ల చొక్కా, ఖాకీ ప్యాంటు వేస్తున్నారు. ఆయన ధరిస్తున్న తెల్ల చొక్కాలు తళుక్కున మెరుస్తూ జగన్ కు హుందాతనం ఇస్తోంది. సాధారణంగా రాజకీయ నాయకులు తెల్ల రంగు చొక్కా అంటే ఖద్దరు వాడతారు.


కానీ జగన్ వాడే తెల్ల చొక్కా మాత్రం ఖద్దరుది కాదు. అసలు మడతలు పడని ఈ చొక్కా బ్రాండ్ పేరు పోలో రాల్ ఫ్లారెన్ అని తెలుస్తోంది. ఈ చొక్కాలకు జేబులు ఉండవు. జగన్ మొదటి నుంచి పోలో బ్రాండ్ నే మెయింటైన్ చేస్తున్నారట. ఈ చొక్కాల ధర ఒక్కొక్కటి 8 వేల నుంచి 12 వేల రూపాయలు ఉంటుంది. ఇదీ జగన్ తెల్ల చొక్కా కథ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: