తెలంగాణ ముఖ్యమంత్రి 'కేసిఆర్' తనయుడు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే 'కేటిఆర్'ని గడ్డంతో ఉన్నప్ప్పుడు ఎప్పుడైనా చూసారా ? ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒకే సమాధానం మేము చూడలేదు అని, కానీ 'కేటిఆర్'ని గడ్డంతో చూడాలని కేటిఆర్ అభిమానులకు, తెలంగాణ ప్రజలకు చాల మందికి ఆసక్తిగా ఉంటుంది.
ఆలా చూడాలనుకున్న ఓ నెటిజన్ కొత్తగా ఆలోచించాడు. ఆ ఆలోచనతోనే తన తెలివితేటలతో, కేటిఆర్ పై అభిమానంతో 'ఫేస్ యాప్' లో 'కేటిఆర్'కి గడ్డం పెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ ఫోటోని ట్విట్టర్ లో 'కేటిఆర్'కి ట్యాగ్ చేస్తూ ''కేటిఆర్ అన్న గడ్డంతో మీరు చాలా అందంగా ఉన్నారు అంటూ ట్విట్ చేశాడు.
అది చుసిన కేటిఆర్ ట్విట్ కి స్పందిస్తూ 'ధన్యవాదాలు, గడ్డంతో బాగున్నాను' అంటూ ట్విట్ కు స్పందించారు. కాగా సోషల్ మీడియాలో ఈ గడ్డం మాత్రమే కాకుండా 'యువకులు వృద్దులు అవుతే ఎలా ఉంటారు' అనే ఫేస్ యాప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫేస్ యాప్ ని సినీ సెలబ్రెటీల నుంచి రాజకీయ నాయకుల వరుకు ప్రతి ఒక్కర తేగా వాడేస్తున్నారు.
Thanks 😀 not bad https://t.co/ORv7Z728HR— KTR (@KTRTRS) July 20, 2019