విద్యుత్ కొనుగోళ్ళల్లో అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్లేనా ?

Vijaya

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాలని చంద్రబాబునాయుడు డిసైడ్ అయ్యారు. విద్యుత్ కొనుగోళ్ళకు సంబంధించి చంద్రబాబు హయాంలో కొన్ని పిపిఏలు జరిగాయి. వాటిల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నది జగన్ అనుమానం. అందుకనే విద్యుత్ కొనుగోళ్ళలో జరిగిన అవినీతిని మొన్నటి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు జగన్.

 

విద్యుత్ కొనుగోళ్ళపై వివిధ సంస్ధలతో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న పిపిఏలను సమీక్షించాలని కూడా జగన్ నిర్ణయించారు. అందుకనే జరిగిన వ్యవహారాలపై నిపుణుల కమిటిని కూడా ఇప్పటికే వేశారు. ప్రాధమిక అంచనా ప్రకారం సుమారు రూ. 3 వేల కోట్ల అవినీతి జరిగిందని జగన్ ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు.

 

నిపుణుల కమిటి అధ్యయనం మరింత లోతుగా జరిగితే తన బండారం మొత్తం రోడ్డున పడుతుందని చంద్రబాబు భయపడుతున్నట్లే ఉన్నారు. అందుకే వెంటనే కోర్టుకు వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. పిపిఏలపై జగన్ చేస్తున్న సమీక్షలను అడ్డుకునేందుకు కోర్టు ద్వారా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.

 

విద్యుత్ కొనుగోళ్ళ పిపిఏల్లో అవినీతికి పాల్పడకపోతే చంద్రబాబు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవైపేమో పిపిఏలన్నీ పారదర్శకంగానే చేసుకున్నట్లు చెబుతూనే మరోవైపు సమీక్షలను నిలిపేయాలని కోర్టుకు వెళ్ళాలని నిర్ణయించటంలో అర్ధమేంటో చంద్రబాబే చెప్పాలి .

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: