జగన్ ఢిల్లీ టూరుకు ఇది సమయమేనా ?

Vijaya

జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వెళుతున్నారు. జగన్ ఢిల్లీ ప్రోగ్రాం ఎప్పుడో నిర్ణయం అయినప్పటికి తాజా రాజకీయ పరిస్ధితుల నేపధ్యంలో ఢిల్లీ పర్యటనతో జగన్ కు పెద్ద ఉపయోగం ఉండదనే అనిపిస్తోంది. రెండు రోజుల పర్యటనలో జగన్ ప్రధానంగా రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ తో పాటు నరేంద్రమోడి,  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, నిర్మల సీతారామన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ను కలుస్తారు.

 

అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తలెత్తిన రాజకీయ పరిణామాల్లో నరేంద్రమోడి, అమిత్ షా ఇద్దరూ  ఒక్కసారిగా బిజీ అయిపోయారు. లోక్ సభలో పాసైన బిల్లు రాజ్యసభలో పాసవ్వాల్సుంది. దాంతో మోడి,  అమిత్ షా ఇదే విషయమై ప్రతిపక్ష నేతలతో మాట్లాడించటం, వ్యూహాలు పన్నటంతోనే బిజిగా ఉంటున్నారు.

 

అదే సమయంలో జమ్మూ కాశ్మీర్ లోని ప్రతిపక్షాలతో మాట్లాడటం, చీఫ్ సెక్రటరితో ఎప్పటికపుడు మాట్లాడుతూ పరిస్దితిని సమీక్షించటం లాంటి అనేక అంశాలపై అమిత్ షా తీరికలేకుండా ఉన్నారు.  ఇటువంటి పరిస్దితుల్లో జగన్ ప్రధానమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రిని కలిసినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే, జగన్ పై ఇద్దరిని కలవాలని అనుకోవటం ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వే జోన్ తో పాటు విభజన హామీల అమలు గురించి మాట్లాడేందుకే.

 

నరేంద్రమోడి, అమిత్ షాలు వాళ్ళ బిజీలో వాళ్ళుంటే మధ్యలో జగన్ మాట్లాడేది డౌటనే చెప్పాలి. ముందుగా తీసుకున్న అపాయిట్మెంట్ కాబట్టి మోహమాటం కొద్ది కలిస్తే కలవచ్చు. అటువంటి సమావేశాలు ఫొటోలకు మాత్రమే పనికొస్తుంది. అంతేకానీ జగన్ డిమాండ్లపై చర్చించే విషయంలో పెద్దగా శ్రద్ధ చూపే అవకాశాలైతే ఉండవనే అనుకోవాలి. కాబట్టి తన ఢిల్లీ పర్యటనలో నరేంద్రమోడి, అమిత్ షా ల నుండి సానుకూల స్పందన వస్తుందని తన డిమాండ్లపై వాళ్ళిద్దరూ సీరియస్ గా స్పందిస్తారని అనుకునేందుకు మాత్రం లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: