కేసుల్లో నిందితులు – రాష్ట్ర దిశా నిర్దేషకులు, కీలక నిర్ణయాల్లో భాగస్వాములు

             ఇంతటి దుస్థితి ప్రజాస్వామ్య భారతదేశంలో ఏరాష్ట్రప్రజలకు పట్టలేదు. ఇది మచ్చలేని మన రాజ్యాంగవ్యవస్థకు ఓసవాల్ ను విసిరింది.పలు కేసుల్లో నిందితులు,పైగా శిక్ష ఖరారైన వారు, దాదాపు ఖరారవుతాయని తెలిసిన వారు మరికొందరు. అయినా వీరే మనరాష్ట్ర భవిష్యత్ దిశానిర్దేషకులు,దీని కోసం తీసుకునే నిర్ణయాల్లో భాగస్వాములు.            రాజ్యాంగం ఎంత వెసులుబాటు ఇచ్చినా సరే కొంత విచక్షణ తోనైనా వ్యవహరిస్తే బాగుండేదేమో. చాలా రోజుల తర్వాత రాష్ట్రప్రగతిని నిర్దేశించడానికి మంత్రిమండలి సమావేశ మవుతోంది. ఈసమావేశంలో మన రాష్ట్రప్రజల సమస్యలు తొలగించడానికి, ప్రజల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు,చేపట్టాల్సిన అభివృద్దిపనుల గూర్చి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉన్న ఈపని ఎవరు చేస్తే న్యాయం జరుగుతుంది అన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం.            ఈసమావేశంలో ప్రజలకు అత్యవసరమే భద్రత గూర్చి చర్చించి నిర్ణయం తీసుకోవాలి, కాని ఇది చేయాల్సిన హోంమంత్రి కూడా ప్రజలను మోసంచేసిన పలు వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భవితను నిర్దారించే పిల్లల చదువులపై నిర్ణయాలు తీసుకోవాలి కాని ఆశాఖ మంత్రికే ఒక కేసులో శిక్ష ఖరారైంది. ఇలా అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన మంత్రులు చాలా మంది ప్రజలను మోసం చేసి,ప్రజాప్రయోజనాలను పనంగా పెట్టి అక్రమాలకు పాల్పడినారన్న కేసుల్లో నిందితులున్నారు. వీరు ఇప్పుడు ప్రయోజనం చేకూరే నిర్ణయాలు ఎలా తీసుకుంటారన్నది అందరి హృదయాలను తొలుస్థున్న ప్రశ్న.            వీరిని పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకుంటారా అంటే ఇక మంత్రివర్గ సమావేశమే వృధా.ఎందుకంటే సగం మంత్రులు నిందితుల జాబితాలోనే ఉన్నారు. సిఎం నిర్ణయాలు తీసుకున్నా సంతకాలు సదరు మంత్రులే పెడితేనే అవి అమలవుతాయి. నేరం చేసిన వారు న్యాయం చేస్తారా... న్యాయమైన పనులను ఆమోదిస్థారా...అన్నది సందేహాస్పదమే. ఏనాడు మన రాష్ట్రం ఏపాపం చేసుకుందో ఈనాడు ఇంత దుర్బర పరిస్తితికి చేరుకుంది అంటూ సాధారణ పౌరులు నిట్టూర్చడం తప్ప. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: