సీఎం జగన్ పై లోకేష్ మరోసారి విమర్శలు..!

guyyala Navya
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. రాష్ట్రం వరదలలో ముంచెత్తుతుంటే ముఖ్యమంత్రి పర్యటనలో ఉన్నారని అయన వ్యాఖ్యానించారు.                     


నారా లోకేష్ ట్విట్ చేస్తూ 'ఇక్కడ వరదల్లో ప్రజలు అల్లాడుతుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత పర్యటనల్లో బిజీగా ఉన్నారు. పరిపాలన చేతగాకే చేతులెత్తేశారు. స్థానికంగా ఉన్న మంత్రులు కూడా వారి బాధ్యతను విస్మరించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై పోరాడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చాను.' అంటూ ట్విట్ చేశారు.                                         


ఈ ట్విట్ కి నెటిజన్లు స్పందిస్తూ ఘాటుగా సమాధానాలు ఇస్తున్నారు. 'వరదలు వచ్చినపుడు నీ ఇళ్ళు ఎక్కడ మునిగిపోతదో అని హైదరాబాద్ కి పారిపోయిన నువ్వు అంత అయ్యాక వచ్చి నేను ఉన్న అంటున్నవా పప్పు బాబు' అంటూ ట్విట్ చేశారు. మరికొందరు స్పందిస్తూ 'ఇలాగే ట్విట్లు చేసుకుంటూ ఉంటె మంగళగిరిలో డిపాజిట్లు కూడా రావు' అంటూ ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.                   


ఇక్కడ వరదల్లో ప్రజలు అల్లాడుతుంటే @ysjagan గారు వ్యక్తిగత పర్యటనల్లో బిజీగా ఉన్నారు. పరిపాలన చేతగాకే చేతులెత్తేశారు. స్థానికంగా ఉన్న మంత్రులు కూడా వారి బాధ్యతను విస్మరించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై పోరాడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చాను.

— Lokesh Nara (@naralokesh) August 22, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: