కొన్ని క్షణాలు గడిస్తే ఆ యువతి ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయేది ఐదంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేది. అడుగు ముందుకు వేయడమే ఆలస్యం. జరగరాని ఘోరం జరిగిపోయేది కానీ, ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి చాకచక్యంగా ఆ యువతి ప్రాణాలు కాపాడాడు. మాటల్లో పెట్టి ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా సూరయపాలెంలో జరిగింది ఈ ఘటన. అమ్మాయి ఆత్మహత్య యత్నానికి కారణమేంటో తెలియదు కానీ, వీడియోను చూసిన వారంతా యువతిని కాపాడిన వ్యక్తి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ ఘటన జరిగినది. తూర్పుగోదావరి జిల్లా సూరంపాలెం ఆదిత్య డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలల క్యాంపస్ లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ అమ్మాయి ఈ క్యాంపస్ కు సంబంధించినటువంటి అమ్మాయి కాదు. ఆమె నల్లగొండ జిల్లా చిలకూరు ప్రాంతానికి చెందనటువంటి బానోతు అనసూయ. అయితే ఈమె గతంలో హైదరాబాద్ లో ఉన్నప్పుడు శివ అనే వ్యక్తిని విశాఖ జిల్లా రావికంపాడుకు చెందినటువంటి ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. అయితే తరువాత శివ వచ్చి ఇక్కడ ఆదిత్య కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కొంత కాలంగా వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనితోటి భర్తను కలుసుకునేందుకు ఇక్కడకు వచ్చినట్లుగా తెలుస్తుంది.
అయితే అతను ఎక్కడ ఉన్నాడో లేదో అనే విషయంలో యాజమాన్యం అక్కడున్నటువంటి సిబ్బంది నుంచి తగిన క్లారిటీ రాకపోవడంతోటి ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే పైకెక్కి దూకడానికి ప్రయత్నించినప్పుడు అక్కడున్నటువంటి సిబ్బంది విద్యార్ధులందరూ కూడా గమనించారు. గమనించి అక్కడున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా వెంటనే అలర్ట్ అయ్యారు. అయితే అప్పటికే ఆ మహిళ పైకెక్కి బాగా పిట్టగోడ కూడా ఎక్కి దూకటానికి సిద్దమైంది. ఈలోపులోనే అక్కడున్నటువంటి సెక్యూరిటీ హెడ్ వెంటనే మాటల్లో పెట్టి పైకి వేగంగా వెళ్లి ఆమెను మాటల్లో పెట్టి ఒక్క సారిగా చేయి పట్టుకుని వెనక్కులాగారు. అతని పేరు రాంబాబు. మొత్తంగా ఆ యువతిని అతను, అక్కడ ఉన్నటువంటి విధ్యార్ధులు కలిసి చాకచక్యంగా కాపాడారు.