సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ మనుగడలో ఉండాలంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తేనే ఉంటుంది అని ఆంధ్రలో పుట్టిన చిన్న పిల్లోడికి కూడా తెలుస్తుంది. కానీ ద గ్రేట్ బాలయ్య చిన్న అల్లుడుకు మాత్రం ఈ విషయం తెలీదు. అందుకే ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు బాలయ్య చిన్న అల్లుడు.
ఇంకా విషయానికి వస్తే 40 ఏళ్ళు చరిత్ర ఉన్న తెలుగు దేశం పార్టీ గతంలో ఎన్నడూ ఇంత ఘోరంగా ఓడిపోలేదు. 2019 లో కేవలం 23 సీట్లతో ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న గత అయుదు సంవత్సరాల సమయంలో అరాచకాలు లెక్క పెట్టలేనన్ని చేశాయి.
తెలుగు దేశం పార్టీ నేతలు చేసిన అక్రమాలు, అవినీతి పనులు, దౌర్జన్యాలను సహించలేక ప్రజలు తీవ్రంగా తరిమికొట్టాయి. వీటిని అర్థం చేసుకోలేని చంద్రబాబు మాట్లాడుతూ 'మేము ఎందుకు ఓడిపోయామే నాకు ఇంకా అర్ధం కావడం లేదు' అంటూ వాపోయారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య అల్లుడు ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాలయ్య అల్లుడు భరత్ మాట్లాడుతూ 'టీడీపీకి ఎన్టీఆర్ అవసరం ఏమాత్రం లేదు.. మా పార్టీలో చాలామంది సమర్థులు' ఉన్నారు అని సంచలన వ్యాఖ్య చేశారు. ఈ ఇంటర్వ్యూ చుసిన కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ లో స్పందిస్తూ బాలయ్య అల్లుడిపై దుమ్మెత్తిపోస్తున్నారు.
NTR avasaram maku ledu - Balayya chinnalludu Bharath
Ippatikaina artham cheskondi NTR fans mee range@avndec31 @karnatiramu pic.twitter.com/PjORbkSPRZ— Ram (@AnuPspk6) August 24, 2019