బీజేపీ నేతల మరణాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సాధ్వీ

Hareesh
ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు మరణించడాన్ని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ లో కీలక నేతలు గా ఉన్న  మనోహర్ పారీకర్, సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ ల మరణం ఆ పార్టీకి తీరనిలోటు. అయితే ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే భోపాల్ ఎంపీ, మధ్యప్రదేశ్ బీజేపీ నాయకురాలు సాధ్వీ ప్రజ్ఞా సింగ్ వీరి మరణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  

బీజేపీ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు చేతబడి చేయిస్తున్నాయని సాధ్వీ ప్రజ్ఞా సింగ్ సంచలన ఆరోపణలు చేసారు. ఈ విషయాన్ని తనకు మహరాజ్ జీ అనే ఆధ్మాత్మికవేత్త చెప్పారని సాధ్వీ ప్రజ్ఞా సింగ్ అన్నారు. నాయకులను కోల్పోవడం బట్టి చూస్తే  బీజేపీపై ప్రత్యర్థులు క్షుద్రపూజలు చేయిస్తున్నారని మహరాజ్ జీ చెప్పింది నిజమే అనిపిస్తోందని అన్నారు. ఇప్పుడు బీజేపీకి దుర్దశ నడుస్తోందన్న భావన కలుగుతోందని ఆమె అన్నారు.

 గోవా ముఖ్యమంత్రిగా, మోదీ గత ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మంత్రిగా భాద్యతలు నిర్వర్తించిన మనోహర్ పారికర్ బీజేపీలో సీనియర్ నాయకుడు. అతడు మార్చి 17న పాంక్రియాటిక్ క్యాన్సర్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అతడు గోవాకు నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసారు. సుష్మ స్వరాజ్.. బీజేపీ మహిళా విభాగంలో అత్యంత సీనియర్ నాయకురాలు. ఈమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా, వాజపేయి, మోదీ ప్రభుత్వాలలో పలు శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. సుష్మ ఆగష్టు 6న హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

ఇక అరుణ్ జైట్లీ.. ఈయన కూడా బీజేపీ లో అత్యంత సీనియర్  నేత. వాజపేయి, మోదీ ప్రభుత్వాలలో కీలక శాఖలకు మంత్రిగా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా, బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఎన్నో పదవులను అధిరోహించారు. ఈయన ఈ నెల 24న శనివారం అనారోగ్యంతో భాదపడుతూ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇలా పార్టీ కీలక నేతలను కోల్పోవడంపై సాధ్వి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: