గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం.. ఇక్కడి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా... ఏ మీడియాలో చూసినా ఈవిడ గారి గురించే చర్చ... చర్చ అంటే సాదాసీదా చర్చ కాదు.. వాడీ వేడి చర్చ... ఇంతకు ఈ మహిళా ఎమ్మెల్యే గురించి అంతలా చర్చించుకోవాల్సిన అవసరం ఏమోచ్చింది అనుకుంటున్నారా... అవసరమే.. ఎంతలా అంటే.. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ ఎమ్మెల్యే గురించే చర్చ... ఇంతకు ఈవిడ ఏమి చేసిందని ఇంతలా చర్చ... అయితే ఓసారి చూద్దాం...
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన సభలో స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడిన తీరు... జగన్ను పొగిడిన తీరు చూస్తే మతిపోవాల్సిందే.. శ్రీదేవి జగన్ను పొగడ్తలతో ముంచేత్తుతుంటే ఏపీ సీఎం జగనే బిత్తరపోయి ఏమీ చేయాలో పాలుపోక ఇబ్బంది పడ్డాంటే శ్రీదేవి వాగ్దాటి, జగన్ను పొగిడిన తీరు సభికులను, నేతలను, ఏప ప్రజలకు దిమ్మతిరిగి పోయిందనుకోండి..
శ్రీదేవి పొగడ్తలు చూస్తే ఏ సినిమా రైటర్ కూడా పనికి రాడు అనే తీరుగా పంచ్ డైలాగ్లు, హాసోక్తుల, జగన్ జపం, ఏపీ సీఎంను కాకాపట్టిన తీరుగానే అందరు అనుకుంటున్నారు.. ఇంతకు ఆమే జగన్ను పొగిడిన ఈటెల్లాంటి మాటలు మచ్చుకు కొన్ని మాత్రమే మీకు అందిస్తున్నాము.. జగనన్నా నీవు తాడేపల్లిలో కట్టుకున్నది ఇల్లు కాదు.. ప్రజల గూడు అన్నా... జగన్ పులి లాంటోళ్ళు... పెద్దలు ముందే ఊహించి ఆయన పుట్టిన ప్రదేశానికి పులివెందుల పేరు పెట్టి ఉంటారు... వైఎస్సార్ ప్రజల్లో నుంచి పుడితే... జగన్ ప్రజల గుండెచప్పుడు నుంచి పుట్టారు అంటూ ఏకదాటిగా, అనర్గళంగా, వాగ్ధాటితో, ఉపన్యాసం కాదు కాదు... జగన్ పొగిడే కార్యక్రమం నిర్విఘ్నంగా సాగించింది.
మధ్యలో మంత్రి పేర్ని నానీ కలుగుజేసుకుని వారించినా ఉపన్యాసం జోరుగానీ, జగన్ను పొగడం కానీ ఆపలేదు... వనమహోత్సవం గురించి చెప్పకుండా జగన్ను పొగడం చూస్తుంటే ఇప్పుడు ఎందుకు కాకా పడుతుందబ్బా అనిపించక మానదు.. శ్రీదేవి పొగడ్తలకు పొంగిపోవాల్సిన ఏపీ సీఎం జగన్ బిత్తర చూపులు చూస్తూ.. నానా ఇబ్బంది పడుతూ.. ఏమీ చేయాలో పాలుపోని పరిస్థితిలో బక్కచిక్కి పోయాడంటే నమ్మండి శ్రీదేవి పొగడ్తల దాటి ఏలా ఉందో... అన్ని బాగానే ఉన్నా.. చివరిలో వైఎస్ మరణానికి మంత్రపూజలే కారణమంటూ ముక్తాయించారు.. ఏదేమైనా ఉండవల్లి శ్రీదేవా.. మజాకా...!!