భూగ్రహంపై వ్యోమగామి.. షాక్ లో నాసా!!?

Balachander
ఇప్పుడు దేశంలో ఏ ఇద్దరినీ కదిలించిన ఓ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు.  అదే చంద్రయాన్ 2.  ఇస్రో చంద్రునిపైకి ప్రయోగించిన చంద్రయాన్ 2 సెప్టెంబర్ 7 వ తేదీన చంద్రునిపై ల్యాండ్ కాబోతున్నది.  చంద్రునిపై ల్యాండర్ ల్యాండైన తరువాత.. అందులోనుంచి రోవర్ విడిపోయి అక్కడ నేలపై పరిశోధన చేయబోతున్నది.  ఇప్పటి వరకు గ్రహాలపై ఎలాంటి జనజీవన స్రవంతి లేకపోవడంతో.. నేలపై రాళ్లు, గుంతలు ఉండటం సహజమే.  


ఒక్కోసారి ఆ గుంతలు ఫుడ్ బాల్ గ్రౌండ్ అంత పెద్దవిగా ఉంటాయి.  అదే భూమిపై ఉన్న రోడ్లు చాలా నీట్ గా ఉంటాయి.  నిత్యం వాహనాలు తిరుగుంటాయి.  అలా వాహనాలు తిరగడం వలన, వానలు కురిసినప్పుడు రోడ్లు పాడైపోతుంటాయి.  అలా పాడైపోయిన రోడ్లను తిరిగి మరమ్మత్తులు చేస్తుంటారు.  రోడ్ల మరమ్మత్తులు చేసే కాంట్రాక్టర్లు నాసీ రకం రోడ్లు వేయడం వలన.. తక్కువ రోజుల్లోనే రోడ్లు పాడైపోతున్నాయి.  


ఒకప్పుడు బెంగుళూరు రోడ్లు చాలా అందంగా ఉంటాయని, అద్భుతంగా ఉంటాయని అంటుంటారు.  కానీ, రోడ్లు అందంగా ఉండటం పక్కన పెడితే.. చాలా దారుణంగా మారిపోతున్నాయి.  ఎక్కడికక్కడ రోడ్లు గుంతలు పడి గందరగోళంగా మారిపోయాయి.  ఆ రోడ్లపై నుంచి వాహనాలు వెళ్లే సమయంలో గుంటల్లో పడి దెబ్బలు తగలడం, మరణించడం వంటివి జరుగుతున్నాయి.  


దీంతో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికీ వినూత్నమైన ఆలోచన వచ్చింది.  వెంటనే స్పేస్ లోకి వెళ్లే వ్యోమగామి డ్రెస్ వేసుకొని వేరే గ్రహంపై నడిచినట్టుగా గుంతలున్న రోడ్డుపై నడవడం ప్రారంభించాడు.  మాములుగా చూస్తే.. నిజంగా అతను వేరేగ్రహంలో ఉన్నాడేమో అనుకుంటున్నారు.  కానీ, ఎదురుగ ఆటో వచ్చేవరకు ఆ వ్యక్తి నడుతున్నది ఇక్కడే అని తెలియదు.  ఆలా నడిచి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  రోడ్ల పరిస్థితి ఇలా దారుణంగా ఉందని చెప్తూ నాసా, ఇస్రో, స్పేస్ ఎక్స్ లను ట్యాగ్ చేశాడు.  ప్రస్తుతం ఈ ట్వీట్, వీడియో వైరల్ అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: