ముస్లిం కరెన్సీ నోట్ పై హిందూ దేవుడు  ..!!

Balachander
దేవుళ్లను పూజించే దేశాల్లో ఇండియా మాత్రమే కాదు.. అనేక దేశాలు ఉన్నాయి. హిందువులు అతి తక్కువగా ఉన్న దేశాల్లో హిందూ దేవుళ్ళ గుళ్ళు, గోపురాలు ఉండటం చూశాం.  ఫిజి వంటి దేశాల్లో హిందువుల జనాభా ఎక్కువ. కాబట్టి అక్కడ హిందువులకు దేవాలయాలు ఉన్నాయి.  అలానే అమెరికా, రష్యా వంటి దేశాల్లో కూడా హిందూ దేవాలయాలు ఉన్నాయి.  ముస్లిం దేశమైన పాక్ లో హిందూ దేవాలయాలు ఉండటం సహజమే.  


ఎందుకంటే, పాకిస్తాన్ ఇండియా నుంచి విడిపోయింది.  కాబట్టి అక్కడ దేవాలయాలు ఉండటం సహజమైన విషయంగానే భావించాలి. కానీ, దేశంలో 87.2% ముస్లిం జనాభా ఉండి, కేవలం 1.6% హిందూ జనాభా ఉన్న దేశాల్లో హిందువులకు ఎక్కువుగా గుళ్ళు గోపురాలు ఉండటం, ఆ దేశ సైనిక చిహ్నంపై ధైర్యానికి ప్రతీకగా కొలిచే హనుమంతుడి చిహ్నం ఉండటం విశేషం అని చెప్పాలి. 


ఇంతకీ ఆ దేశం ఏంటి.. ఎక్కడ ఉంది.. అనే విషయాలకు వస్తే.. ఆ దేశం పేరు ఇండోనేషియా..ఇండోనేషియా ముస్లిం దేశం. అక్కడ చట్టాలు ముస్లింలకు అనుగుణంగా ఉంటాయి.  అయితేనేం హిందువులకు అక్కడ సమానమైన హక్కులు ఉన్నాయి.  హిందువులను గౌరవంగా చూస్తారు.  హిందూ దేవుళ్లను పూజిస్తారు.  అంతేకాదు, ఆ దేశ కరెన్సీ 2000 రూపియా పై హిందూ దేవుడు వినాయకుడి బొమ్మ ఉంటుంది.  


ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అనే చెప్పాలి.  హిందువులు ఎక్కువుగా ఉన్న మన దేశంలో ఇలా ఉండదు.  గాంధీగారి బొమ్మ తప్పించి మరొకటి ఉండదు.  కానీ, ముస్లిం దేశమైన ఇండోనేషియాలో 2000 రూపియా నోటుపై గణపయ్య బొమ్మ ఉండటం అంటే మాములు విషయం కాదు.  పరమత సహనానికి ఆ దేశం పెట్టింది పేరుగా మారిపోయింది. జకార్తాలో జకార్తా స్క్వేర్ లో కృష్ణార్జున విగ్రహాలు, బాలి పర్యాటక చిహ్నంలో హిందూ దేవుళ్ళు ఉండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: