వంగ‌వీటికి జ‌నసేన‌లో ఆ ప‌ద‌వి ఫిక్స్ అయ్యిందా..!

VUYYURU SUBHASH
వంగ‌వీటి రంగా.. ఈపేరు వింటేనే బెజ‌వాడ‌లో హ‌డ‌ల్ పుట్టించిన నేత‌గా గుర్తుకొస్తాడు.. ఆయ‌న కొడుకు వంగ‌వీటి రాధా.. ఇప్పుడు రాధా ప‌రిస్థితి రెండింటికి చెడ్డ రేవ‌డిగా మారింది. పాపం ఆయ‌న రాజ‌కీయ జీవితమంతా ఆగ‌మ్య‌గోచ‌రంగా మార‌డంతో ఇప్పుడు ఏమీ చేయాలో తెలియ‌క దిక్కుతోచ‌ని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఏ గ‌మ్యం లేని బాట‌సారిగా సాగిపోతున్న వంగ‌వీటి రాధా ఇప్పుడు జ‌న‌సేన ఆధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పంచ‌న చేర‌నున్నాడ‌నే టాక్ రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తుంది.


ప్ర‌స్తుతం టీడీపీలో కొన‌సాగుతున్న వంగ‌వీటి రాధా కు నిల‌క‌డ లేని రాజ‌కీయాల‌తో త‌న రాజ‌కీయ స‌మాధిని తానే త‌వ్వుకున్నాడు. ఎమ్మెల్యే గా చిన్న‌వ‌య‌స్సులోనే గెలిచిన వంగ‌వీటి 2009లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని ఆఫ‌ర్ చేశాడ‌ట‌. అయితే మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీలో కేవ‌లం కులం కార్డుతోనే చేరిపోయాడు. అక్క‌డ చేరిన రాధాకు మ‌ల్లాది విష్ణు చేతిలో ఓట‌మి త‌ప్ప‌లేదు.. ఇలా మొద‌టిసారిగా రాజ‌కీయంగా త‌న గోతిని త‌వ్వుకున్నాడు.


కాపు సామాజికవర్గ నాయకుడు వంగవీటి రాధా తాజాగా జనసేనలో చేరనున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిన్న వయసులోనే రాజకీయాలలోకి వచ్చిన రాధా వైఎస్ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా నిరూపించుకున్నాడు. అయితే 2009 లో వైఎస్ మంత్రి పదవి ఇస్తానన్నా కాదని, తన కాస్ట్ ఫీలింగ్‌తో కాంగ్రెస్‌ను వీడి ప్రజారాజ్యం తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఆయన మ‌ల్లాది విష్ణు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఇలా త‌న రాజ‌కీయ గోతిని త‌వ్వుకున్న రాధ త‌రువాత ప్ర‌జారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయింది.


ఇక చేసేది ఏమీ లేక చిరంజీవిని కాద‌ని కాంగ్రెస్‌లో చేర‌కుండా, ఆయ‌న వైఎస్ జ‌గ‌న్ స్థాపించిన వైసీపీలో చేరాడు. త‌రువాత ఆయ‌న‌కు అచ్చి వ‌చ్చిన విజ‌య‌వాడ సెంట్ర‌ల్ స్థానం నుంచి పోటీ చేయ‌కుండా 2014 ఎన్నిక‌ల్లో తూర్పు నుంచి పోటీ చేయ‌డంతో మ‌రోసారి ఓట‌మి పాల‌య్యాడు.. ఇలా రెండో త‌ప్పిదం చేసిన రాధా త‌రువాత పార్టీలో క్రియాశీల‌క‌మైన పాత్ర పోషించాడు. రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లో భాగంగా మ‌ల్లాది విష్ణు వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ బాధ్య‌త‌లు మ‌ల్లాది విష్ణుకు అప్ప‌గించ‌డంతో మాన‌స్థానం చెందిన రాధా కినుక వ‌హించాడు.. జ‌గ‌న్ రాధాకు పెద్ద పీట వేస్తూనే విజ‌య‌వాడ తూర్పు లేదా బంద‌రు ఎంపీ టికెట్ ఇస్తాన‌ని ఆఫ‌ర్ ఇచ్చినా రాధ త‌న మ‌న‌స్సు మార్చుకోక‌పోవ‌డంతో వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు.


అయితే చంద్రబాబు నాయుడు కాపు సామాజికంగా రాధాతో క‌లిసి వ‌స్తుంద‌ని భ్ర‌మ ప‌డి ఎమ్మెల్సీ, రాజ్య‌స‌భ అంటూ ఊద‌ర‌గొట్ట‌డంతో టీడీపీలో చేరాడు. ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోవ‌డం, వంగ‌వీటి క‌థ రెండింటికి చెడ్డ రేవ‌డి క‌థ అయింది. ఇక టీడీపీ ఓడిపోవ‌డంతో చేసేదేమి లేక రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నాడు. ఇక రాజ‌కీయంగా స‌న్యాసం స్వీక‌రిస్తాడ‌నుకుంటున్న త‌రుణంలో రాధా మ‌రో రాజ‌కీయ పార్టీని వెతుకుంటున్నాడు.. ఎక్క‌డ ఎవ్వ‌డు దిక్కులేక పోతే అక్క మొగుడే దిక్క‌యిండ‌న్న‌ట్లుగా ఆనాడు అన్న పార్టీలో ఆగ‌మైన రాధా ఇప్పుడు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పంచ‌న చేరేందుకు రెడి అయ్యాడ‌ట‌.


వంగ‌వీటి రాధా పార్టీ తీర్థం పుచ్చుకోగానే జ‌న‌సేన‌లో క్రీయాశీల‌క‌మైన పాత్ర ఇవ్వ‌నున్నాడ‌నే టాక్ వినిపిస్తుంది. జ‌న‌సేన కార్య‌నిర్వ‌హాక అధ్య‌క్షుడిగా వంగ‌వీటి రాధా నియ‌మితులు అవుతాడ‌నే ప్ర‌చారం రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా వినిప‌డుతుంది. ఇక వంగ‌వీటి రాధ క‌నుక జ‌న‌సేన‌లో చేరితే ఆయ‌న చేరిన  పార్టీల సంఖ్య ఐదోది అవుతుంది. సో వంగ‌వీటి రాధా కృష్ణ‌కు కాలం క‌లిసి వ‌స్తుందో.. లేక రాజ‌కీయ స‌మాధి అవుతాడో వేచి చూడాల్సిందే..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: