చంద్రయాన్ 2 గురించి స్పదించిన  నాసా

చంద్రుని  ఫైకి చేరుకోవాలని  ఇస్రో చేసిన ప్రయోగం  అడుగు దూరంలో నిలిచిపోయింది. చంద్రుని కి రెండు కోలోమీటర్ల  దూరంలో  ఉండగా  చంద్రయాన్  2 ల్యాండర్  విక్రమ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో  ఈ ప్రయోగం అసంపూర్ణంగా మిగిలిపోయింది.  దాంతో యావత్ భారతావని తీవ్ర నిరాశలో మునిగిపోయింది.  కాగా ఇప్పటివరకు  రష్యా , అమెరికా ,చైనా  ఈ మూడు దేశాలు మాత్రమే చంద్రునిపై తమ వ్యోమ నౌకలను సురక్షితంగా దింపగలిగాయి. 


అయితే భారత్ అత్యంత సంక్లిష్టమైన  దక్షిణ ధ్రువం ద్వారా  చంద్రుడిని చేరుకొని ఎవరికి సాధ్యం కానీ  ఘనత ను సాధించాలనుకుంది.  కానీ చివరి నిమిషంలో ఆ ప్రయత్నానికి బ్రేక్ పడింది. అంత మాత్రానా  ఈప్రయోగం పూర్తిగా  విఫలం అయినట్లు కాదు. ల్యాండర్ విక్రమ్ చంద్రుడి మీద క్షేమంగా ల్యాండయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.  కానీ అది చంద్రుడి మీద నుంచి సిగ్నల్ పంపితే కానీ ఆ విషయాన్ని నిర్ధారించడానికి వీలుపడదు. ఇక ఇస్రో  చేపట్టిన ఈ ప్రయోగం ఫై ప్రపంచ వ్యాప్తంగా  ప్రశంసలు కురుస్తున్నాయి.  అందులో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ  నాసా ,ఇస్రో ప్రయత్నాన్ని అభినందించింది. 


జాబిలి ఫైకి  చేరుకోవడం  చాలా కష్టమైన పని... చంద్రయాన్ 2 ద్వారా  అక్కడ కాలు మోపాలని ఇస్రో చేసిన ప్రయత్నం అద్భుతం. మీ ప్రయోగం మాలో స్ఫూర్తినింపింది.   సౌర కుటుంభ పరిశోధనల్లో  మనిద్దరి మధ్య  పరస్పర సహకారం అందిపుచ్చుకునేందుకు  ఈ ప్రయోగం అవకాశం కల్పించింది  అని  నాసా ట్వీట్ చేసింది. 



Space is hard. We commend https://twitter.com/isro?ref_src=twsrc%5Etfw">@ISRO’s attempt to land their https://twitter.com/hashtag/Chandrayaan2?src=hash&ref_src=twsrc%5Etfw">#Chandrayaan2 mission on the Moon’s South Pole. You have inspired us with your journey and look forward to future opportunities to explore our solar system together. https://t.co/pKzzo9FDLL">https://t.co/pKzzo9FDLL

— NASA (@NASA) https://twitter.com/NASA/status/1170385925077131264?ref_src=twsrc%5Etfw">September 7, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: