మోడీ ప్లాన్ తోనే చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నాడా..?

praveen
ఆంధ్ర ప్రదేశ్ లో తాజాగా జరిగినా ఎన్నికల్లో గెలుస్తామని ధీమాతో ఉన్న టీడీపీ కి ఘోర పరాజయం ఎదురైంది.ఊహించని విదంగా మెజారిటీ 
స్థానాలు సొంతం చేసుకుని టీడీపీ కి సరైన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది వైసీపీ .అయితే ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి ఎదో ఒక అంశాన్ని తెరమీదకి తెచ్చి ఒకరిపై ఒకరు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు అధికార,ప్రతిపక్ష పార్టీలు  .


అధికార వైసీపీ పాలనలో ఫుల్ జోష్ చూపిస్తుంది అంటే ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించింది కాబట్టి అనుకోవచ్చు కానీ... ఇప్పట్లో  ఎన్నికలు లేవు మరి బాబు పార్టీ కి పూర్వ వైభవం తీసుకురావటానికి ప్రయత్నించటం ... రాజకీయ పోరాటాలకు పిలుపునివ్వడం లాంటివి ఎందుకు చేస్తున్నారు ...అసలు బాబు ఉద్దేశ్యం ఏమిటో అని  అందరు ఆలోచనలో పడ్డారు . అయితే ఈ వ్యవహారాల వెనుక బాబు మాస్టర్ మైండ్ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది . బీజేపీ చీప్ అమిత్ షా,ప్రధాని నరేంద్ర మోడీ ప్లాన్  బాబు పాటిస్తున్నట్టు కనిపిస్తుంది .


మూడేళ్ళలో జమిలి ఎలెక్షన్స్ నిర్వహించాలనే ఉద్దేశ్యంతో అమిత్ షా , మోడీ ఉన్నారట .ఒకేసారి  దేశం  మొత్తం జమిలి ఎన్నికలు నిర్వహించి అందులో గెలిస్తే కీలక  నిర్ణయాలు తీసుకోవాలనే యోచనలో బీజేపీ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది . అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అలెర్ట్ అయ్యాడు.మొన్న జరిగిన ఎలెక్షన్లలో ఘోర పరాజయం తర్వాత ఆంధ్ర లో పార్టీ పరిస్థి అద్వానంగా తయారయ్యింది . టీడీపీ నేతలు పార్టీ ఉండాలి పోవాలా అనే కన్ఫ్యూషన్ లో ఉన్నారు . ఇప్పటి నుండి పార్టీ కి పూర్వ వైభవం తెస్తేనే ...తమ పార్టీ కి ప్రజల్లో కాస్త ఆదరణ పెరిగి గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నాడట చంద్రబాబు . 
 
అయితే నిజంగానే మోడీ జేమిలి ఎలెక్షన్లు నిర్వహించేందుకు ప్లాన్  చేస్తున్నారా అంటే దానిపై పలు సందేహాలు లేకపోలేదు . దేశం ఆర్ధిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ... మాంద్యాన్ని తగ్గించేందుకు కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తుంది . ఈ ఆర్థిక మాంద్యం నేపధ్యంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: