టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ సినీజీవిత విశేషాలు..

satvika
నన్ను ఎవరు కోట్లే.. అనే డైలాగు గుర్తుందా.. అదేనండి నితిన్ సినిమాలో నటుడు శివ ప్రసాద్ చెప్పిన ఆ డైలాగు బాగా పేమస్ అయింది. ఇక ఆ సినిమా కూడా బాగా హిట్ అయింది. అసలు విషయానికొస్తే... శివ ప్రసాద్ గారు ఇవ్వాళ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసారు. 


ఈయన 1951 లో జులై 11  చిత్తోర్ జిల్లా పొట్టిపల్లిలో జన్మించారు. అక్కడే తన విద్యాబ్యాసం చేసిన శివ ప్రసాద్ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో వైద్య విద్యను పూర్తిచేశారు. భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సినిమాలలో మంచి నటుడుగా చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన సినీ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాము. ఎన్నో సినిమాలలో విలన్ గా, కమెడియన్ గా నటించారు. 


స్వతహాగా శివ ప్రసాద్ గారు రంగస్థల నటుడుగా తన నాటకీయ జీవితాన్ని ప్రారంభించాడు. కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు. క్యారెక్టర్ ఆరిస్టుగా ను, సపోర్టింగ్ యాక్టరుగా నటించారు. అంతేకాకుండా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలు కూడా బాగా హిట్ అయ్యాయి. ఆ తర్వాత దూసుకెళ్తా, ఆటాడిస్తా, మస్కా, కుబేరులు, ఒక్కమగాడు, కితకితలు, ఖైదీ వంటి ఎన్నో సక్సెస్ చిత్రాల్లో ఆయన నటించారు. 


ప్రేమ తపస్సు, టోపీ రాజా స్వీటీ రోజా మరికొన్ని సినిమాలకు శివ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఒకవైపు సినిమాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు. టీడీపీ పార్టీలో చేరిన ఈయన.. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్లే గా గెలిచాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు టీడీపీ తరపున పోరాడుతూ వచ్చాడు. టీడీపీ సత్తాను చూపడానికి అయన అసెంబ్లీ ముందు ఎన్నో నాటక పాత్రలతో వచ్చి తన స్టయిల్లో ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టించారు. ఇకపోతే ప్రస్తుతం అయన మన మధ్య లేరు. రేపు సాయంత్రం అయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: