సమాచార చట్టానికి తూట్లు పొడుస్తున్నట్లున్న ఎస్వీ యూ ఇంచార్జి రిజిస్ట్రార్ తీరు ?

Hareesh
ప్రజల చేత - ప్రజల కొరకు - ప్రజల యొక్క ప్రభుత్వం అనే ఈనాటి దేశమును చూడడానికి కోట్ల మంది భారతీయులు తమ ధన, మాన, ప్రాణాలను, ఆఖరకు తమ కుటుంబాలను పణంగా పెట్టారు.
అబ్రహం లింకన్ అన్నట్లుగా మీకు ప్రజాస్వామ్యం ఇవ్వబడింది - దానిని కాపాడుకోవలసిన బాధ్యత మీదే అని... భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి మనం పోరాడి సాధించుకున్న హాక్కు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్... సమాచార హక్కు చట్టం.
రిజిస్ట్రార్ ఛాంబర్ లోనే సామాజిక బాధ్యత క్రింద గత రెండు సంవత్సరాలుగా ఎస్వీయూ కు సహాయ పడుతున్న కంపెనీ ప్రతినిధిపై మాటలతో, హావ భావాలతో దాడి చేశారని, దాదాపు నిర్బంధించి ఆ ప్రతినిధి అభీష్టానికి వ్యతిరేకంగా సంతకాలు తీసుకుని ఘన చరిత్ర వహించిన ఎస్వీయూ పరువు గంగలో కలిపారని ఆరోపణలు వస్తున్న ఇంచార్జి రిజిస్ట్రార్ గారిపై గంభీరమైన మరొక ఆరోపణ వెలుగులోకి వస్తుంది ఎస్వీయూ సంబంధించి వచ్చిన ఆర్ టిఐ అప్లికేషన్లు అన్నీ బుట్ట దాఖలు అవుతున్నాయి లేకపోతే ఎదో సమాధానం ఇవ్వాలి కాబట్టి అర్థం - పర్థం లేని సమాధానాలు ఎదో పంపిస్తున్నారట. 


సమాచార హక్కు చట్టం పరిథిలో ఒక అప్లికేషన్ వచ్చిన నాటి నుండి... సంబంధించిన పూర్తి సమాచారం లీగల్ గా అందచేయబడే వరకు పాటించవలసిన విధి - విధానాలు, నిర్వహించవలసిన ఫైల్స్ ఎలా ఉండాలి, ప్రతి అప్లికేషన్ కు ప్రత్యేక  గుర్తింపు నెంబర్ ఇవ్వడం దగ్గరినుండి, సంబంధించిన సమాచారాన్ని ఆర్గనైజషన్లో మిగిలిన డిపార్టుమెంట్ల వద్దనుండి సేకరించే ప్రక్రియ, దానికి సంబంధించి మైంటైన్ చేయవలసిన ఫైల్స్ ఇలా ... ప్రతి ఒక్క విషయాన్ని సమాచార హక్కు చట్టం కూలంకుషంగా తెలియజేస్తుంది.
ఐతే, గంభీరమైన ఆరోపణలు ఎదురుకుంటున్న ఈ ఇంచార్జి రిజిస్ట్రార్ పాలనలో ఈ  సమాచార హక్కు చట్టం కు సంబంధించిన అతి ముఖ్యమైన పనులన్నీ అటకెక్కినట్లే నట ... కుప్పలు తెప్పలు గా  సమాచార హక్కు చట్టం ఫిర్యాదులు ఎస్వీయూ లో మురిగిపోతున్నా ఇంచార్జి రిజిస్ట్రార్ గారు వాటిపై శీతకన్ను వేసారట...


అర్రే, రానున్న రోజులలో ప్రభుత్వం నుండి దీనికి సంబంధించిన విచారణ వస్తే మా పరిస్థితి ఏమిట్రా దేవుడా అని తలపట్టుకు కూరుచుంటున్నారట  ఎస్వీయూ లోని సమాచార హక్కు చట్టం సంబంధించిన అధికారులు.
సమాచార హక్కు చట్టం  నిబంధనలలో ఒక ఫిర్యాదు చేసిన ఫలానా గడువు లోపల సంబంధిత ప్రభుత్వ శాఖ స్పందించకపోతే, కక్షిదారు ఫస్ట్ అప్పీలేట్ చేసుకునే అవకాశం ఉంటుంది... ఇలాంటి ఫస్ట్ అప్పీలేట్ అప్లికేషన్లు రావడమే ఆయా ప్రభుత్వశాఖ పనితీరుకు గొడ్డలి పెట్టు అని అంటుటారు...


ఇక్కడ బాధాకరమైన విషయమేమిటంటే ఎస్వీయూ ఇంచార్జి రిజిస్ట్రార్ గారి హయాంలో అటువంటి ఫస్ట్ అప్పీలేట్ లు ఎన్ని వచ్చినా కూడా ఇసుమంతైనా కదలిక ఉండడంలేదట. ఇటువంటి ఘటనలు చూస్తేనే అనిపిస్తుంది... మనం రాజరికంలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని, ఇప్పటికైనా ఇంచార్జి రిజిస్ట్రార్ గారు తనది ప్రభుత్వం ఇచ్చిన పొజిషన్ మాత్రమేనని తనకంటే ముందూ ఎస్వీయూ ఉంది, తన తరువాతా ఎస్వీయూ ఉంటుంది, ప్రభుత్వం, చట్టం, మార్గదర్శకాల ప్రకారమే తన పాలనా, నిర్వహణ ఉండాలి తప్ప... ఇదేదీ.. ఎవరింటీ సొంత సొమ్ము కాదు, ఎస్వీయూ వంటివి రాష్త్ర ఆస్తులు, జాతీయ సంపదలు అని గుర్తెరగాలి అని చెవులు కోరుక్కుంటున్నారట మిగిలిన ఆచార్యులు, సిబ్బంది, కళాశాలల యాజమాన్యాలు. 


ఇలాంటి ఆరోపణలు ఎదురుకుంటున్న వారు భావి భారత సమాజాన్ని తయారు చేసే పొజిషన్లలో ఉండడం ఎంతవరకు సమర్థనీయం ? అందరిలాగే... ఎప్పటిమాదిరిగే... ఇవ్వన్నీ తప్పుడు ప్రచారాలు అని చెప్పే ముందు... అస్సలు ఎన్ని ఫిర్యాదులు సమాచార హక్కు చట్టం పరిథిలో వచ్చాయి? వాటిలో ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి ?  వాటిలో ఎన్ని ఫస్ట్ అప్పీలేట్ కు వచ్చాయి? అనే విషయాలను అధికారికంగా వెల్లడి చేస్తే బావుంటుందంటున్నారు ఆంధ్రప్రజలు. 
మరి ఇలాంటి అధికారులు, వారి మీద వస్తున్న గంభీరమైన ఆరోపణలు గురించి మీరేమంటారు? 


65 సంవత్సరముల ఘన చరిత్ర కలిగి, యావత్ రాయలసీమ, చిత్తూరు మాత్రమే కాక... యావదాంధ్రకు మేధో భాండాగారమై, కలియుగ దైవము శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పేరు మీద నడపబడుతున్న శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం... జన ప్రియ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన రెడ్డి గారి జనప్రియ పారదర్శక పాలనోలనన్నా ప్రక్షాళన కావింపబడి తెలుగు జాతికే గర్వకారణంగా నిలువాలనేదే ... స్వప్రయోజన-స్వార్ధాలకు పాల్పడే వారు కాకుండా యూనివర్సిటీని అభివృద్ది పధాన నడిపే వారు నాయకులుగా ఉండి అందరి హక్కులనూ కాపాడాలనేదే   ఈ పోరాట అంతిమ లక్ష్యం.


మీ స్పందనను తప్పక తెలియ చేసి, భావి భారత జాతిని కాపాడమని కోరుకుంటుంది ఇండియా హెరాల్డ్ గ్రూప్.


వికలాంగునిపై ఎస్వీయూ అఘాయిత్యం గురించి మరిన్ని పరిశోధనాత్మక విశ్లేషణలు: 

  • వికలాంగునిపై ఎస్వీయూ ప్రతాపం: పది రోజులైపోయింది ?


  • ఆత్మహత్యలు బెదిరింపులు ఇవేనా సార్లు మీరు నేర్పే చదువులు..?


  • ఎస్వీయూ..? సాయం చేసే వారినే సాధిస్తారా..? ఇదేం మాయరోగం..?


  • ఎస్వీయూ రిజిస్ట్రారు సారూ..? ఆ ఉద్యోగాలు ఎంతకు అమ్మేసుకున్నారు..?


  • అభిన‌వ సూసైడ్ ఫ్యాక్ట‌రీలుగా త‌యార‌వుతోన్న విద్యాల‌యాల త‌ప్పులు..?


  • "వీళ్ళు మారరప్పా : సీఎస్సార్ వద్దు, కమిషన్లే ముద్దు ...ఇదీ ఎస్వీయూ పద్దు"


  • సంచలనం : మొన్న విద్యార్థి బలవన్మరణం, నేడు వికలాంగుడిపై దాడి ఆరోపణలు - కొత్త ఇంచార్జి రిజిస్ట్రార్ చేతగానితనమే కారణమా..?


  • మంచి మాకొద్దు - మనీనే ముద్దంటున్న ఘన యూనివర్శిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ ?


  • యూనివర్శిటీలు రాజకీయాలకు అడ్డాలుగా మారాయా..?


  • ఎస్వీయూ ప‌రువు రిజిస్ట్రార్ చేతిలో గోవిందా.. గోవిందా...?


  • అర్రే: రాష్ట్రం మొత్తం వైసీపీ ప్ర‌భుత్వం... ఇక్క‌డ మాత్రం టీడీపీ అజెండానే.. ?


  • ఎస్వీయూ ఘోరంలో రాజకీయ కోణం !


  • హృదయ విదారకం : ప్లీజ్ సర్ నేను వికలాంగున్ని నన్ను మరింత భయపెట్టొద్దు ప్లీజ్ ?


  • చట్టం ఏమైనా వారికి చుట్టమా ... కేసు ఎందుకు నమోదు చేయలేదు ?


  • చట్టాలు చేసేవాళ్ళను తయారుచేసే వాళ్ళే పంచాయతీలు చేస్తే ఎలా ?


  • ఎస్వీయూ బాగుపడాలంటే డైరెక్టుగా ముఖ్యమంత్రి జగన్ గారే రంగంలో దిగాలా ?


  • పేరుకు ఆచార్యులు.. వీళ్లకు సాంప్రదాయాలు పట్టవా ?


  • ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?


  • విశ్వ విద్యాలయాలు - నిజంగా ఆధునిక దేవాలయాలేనా :ఎస్వీయూ సోదాహరణ?


  • హతవిధీ : ఎస్వీయూ ఫెయిల్ మళ్ళీ మళ్ళీ...?


  • హవ్వా 'ఎస్వీయూ' నీకిది తగునా ?


  • ఆచార్యులేనా వీళ్లు - వికలాంగునిపై బ్రహ్మాస్త్రమా ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: