సునామీలా ముంచుకొస్తున్న అమెరికా ఆర్ధికమాంద్యం కూడా తోడైతే భారత ఆర్ధిక రంగం కుదేలైపోనుందా?

“ప్రధాని నరేంద్ర మోదీ చేత కాని తనం వల్లే దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొందన్నారు.పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు కూడా ప్రభావం చూపొస్తున్నాయన్నారు. అంతర్జాతీయ అవకాశాల్ని కేంద్రం అందిపుచ్చుకోవడం లేదని మన్మోహన్ ఆరోపణలు చేశారు. భారత్‌ ఆర్థికంగా వృద్ధి చెందే అవకాశాలున్నా కూడా సరైన ప్రభుత్వపాలన లేక దేశం కష్టాల్లోకి వెళ్లాపోతుందని ఆవేదన వ్యక్తంచేశారాయన. రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. రైతులు, నిర్మాణరంగంలో కూలీలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎగుమతుల్ని ప్రోత్సహించడం లేదని మండిపడ్డారు.” మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్

 

Congress

✔@INCIndia

Our economy has not recovered from the man-made blunders of demonetization & a hastily implemented GST... I urge the govt to put aside vendetta politics & reach out to all sane voices to steer our economy out of this crisis: Former PM Dr Manmohan Singh #DrSinghOnEconomicCrisis

33.4K

10:00 AM - Sep 1, 2019

Twitter Ads info and privacy


పై వ్యాఖ్యలు - ఆషామాషీ వ్యక్తి చేసినవి కావు. అవి ఆర్థికమాంద్యంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు. సరళీకృత ఆర్ధిక విధానాలతో భారత జాతి గౌరవాన్ని హిమోన్నత స్థాయికి చేర్చిన మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహరావు హయాంలో దేశ ఆర్థికమంత్రిగా- అంతకు ముందు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా రెండు దఫాలు వ్యవహరించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ - ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న ఆర్థిక స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేశారు.


“భారత్‌ను ఆర్థిక మాంద్యం ముంచేస్తోందన్నారు” మన్మోహన్ సింగ్


భారత్‌ ను ఆర్థికమాంద్యం ప్రభావం-కేంద్ర ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ- ఎన్ని కబుర్లు చెబుతున్నప్పటికీ ప్రజాజీవితంపై ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధానిగా నరేంద్ర మోడీ  నాయకత్వంలో ఎన్ డి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పెను సంక్షోభానికి గుఱికాబోతోందని తేటతెల్లమౌతుంది.


*ఒక ప్రక్క భారత ప్రజల సుధీర్ఘ కాల ఆకాంక్షైన ఆర్టికల్ 370 రద్దుతో  కశ్మీర్ సమస్యకు ఒక పరిష్కారం సాధించటం

*మరో ప్రక్క సమర్ధవంతమైన విదేశీ దౌత్య విధానాల పరిపుష్ఠత

*అస్థిరత తొలగి ఏర్పడ్డ సుస్థిరమైన పాలన

*పాలనలో అవినీతి రహిత విధానాలు


ఇవన్నీ దేశ ప్రజల మద్దతును, విశ్వాసాన్ని నరెంద్ర మడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడగట్టుకుంది. అందుకే నాలుగు నెలలక్రితం నాటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వానికి భారీ మెజార్టీతో మద్దతు ప్రకటించారు భారత ఓటర్లు. ఇప్పటికే ఆర్ధిక వృద్ధి రేటు డీలా పడుతూ క్రమంగా 2014-15 స్థాయికి పడిపోయిది. బ్యాంకింగ్‌ వ్యవస్థ, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల సమస్య నుంచి బయటపడలేదు. ఎన్‌ బీ ఎఫ్ సి వ్యవస్థ ద్రవ్య కొరతతో  సంక్షోభంలో వ్యవస్థ స్థితిలో పడి కొట్టుమిట్టాడుతోంది. రియల్‌ ఎస్టేట్‌, ఆటోమొబైల్‌, ఎఫ్‌ఎంసీజీలతోపాటు పలురంగాల్లో క్రయవిక్రయాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం విస్పోఠనమై తోడైతే - విషసర్పంలా కోరలు చాస్తే ఈసారి ‘ఆర్ధిక భారతం’ పూర్తిగా కుదేలయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు, అనుభవజ్ఞులు  అభిప్రాయ పడుతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలతో, దేశ ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన అంశాల్లో మోడీ ప్రభుత్వం తప్పటడుగులు వేసిందనే భావన బలంగా వ్యక్తమవుతోంది.


*రాజకీయాలు,

*రాజకీయ ధృవీకరణం (పొలిటికల్ పోలరైజేషన్)

పై ఎక్కువ దృష్టి పెట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వం - ఒక అధికార పార్టీ రాజకీయంగా బలపడితే తప్ప ప్రజాస్వామ్యంలో మౌలిక మార్పులు తీసుకురావటం అసాధ్యం. ఇలా జరగాల్సిందే.


అత్యధిక విమర్శకుల విమర్శలకు గురైన నోట్లరద్ధు దేశ సార్వభౌమత్వ పరిరక్షణలో భాగంగా మారిపోయింది. అదే జరగకపోతే నేడు పాకిస్తాన్ కాలనాగులా కోరలు చాచి విషం చిమ్ముతూ బుసగొట్టి ఉండేది. ఇప్పుడు దానికి ఓట్టి బుస మాత్రమే మిగిలింది. రకరకాల కారణాలతో సెంటిమెంటును రంగరించి ప్రజలను సంఘటితం చేసి అనూహ్య రీతిలో బీజేపీ బలపడింది. ఒక పార్టీగా అది తప్పుకాదు.

అయితే అంతా మంచే జరిగినా - ఆర్థిక రంగాన్నినిర్లక్ష్యం చేసిందని ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలకు నిపుణుల నుంచీ వత్తాసు లభిస్తోంది.

దేశ సమగ్రతలో అద్బుత విజయం సాధించినా ఆర్ధిక రంగంలో ప్రభుత్వం సాధించాల్సింది చాలా వుంది.

 

కారణాలేవైనా కానీ, ఆర్థిక రంగంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు కోట్ల మంది ప్రజల జీవితాలపై పడుతున్నాయి. గతంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాల పర్యవసానాలు ప్రస్తుతం చర్చనీయమవుతున్నాయి. దేశంలోని వివిధ రంగాలు సంక్షోభ సెగల తాకిడిని ఎదుర్కొంటున్నాయి.


2016లో పెద్దనోట్లను రద్దు చేసినప్పుడు ఆర్థిక నిపుణులు భవిష్యత్తులో దీని ప్రభావం చాలా చెడుగా ఉంటుందని చెప్పారు. ఆర్థిక నిపుణుడైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దాదాపు రెండు శాతం జీడీపీ పడిపోతుందన్నారు. నల్లధనాన్ని నిరోధించడానికి, అవినీతిని అరికట్టడానికి నోట్లరద్దు చేశామంటూ ప్రధాని మోడీ ప్రకటించారు. రోజుల తరబడి డబ్బుల కోసం రోడ్లపై కునారిల్లినా ప్రజలు సహనంతో భరించారు. దేశానికి మంచి జరుగుతుందన్న ప్రధాని మాటను విశ్వసించారు.


అయితే నల్లధనం మాత్రం కనిపించలేదు. దీనికి కారణం అమలు లోపం వ్యక్తుల స్వార్ధం అని చెప్పక తప్పదు. ఎవరికి వారు జాగ్రత్త పడిపోయారు. చెలామణిలో ఉన్న రద్దయిన నోట్లన్నీ బ్యాంకుల్లోకి వచ్చి చేరాయి. దాంతో నగదు రూపంలోని నల్లధనం బ్యాంకులకు తిరిగి జమ కాదన్న భ్రమలు తొలగిపోయాయి. ఈలోపు ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం అంతా ఇంతాకాదు. దీర్ఘకాలంలో దాని ప్రభావం ఉంటుందని ఊహించిన వారి ఊహలు తాజా పరిణామాల్లో ఋజువు అవుతున్నాయి. 


సాధారణంగా ఆర్థిక ఒడిదుడుకులను కొంతమేరకు సంఘటిత రంగం తట్టుకోగలుగుతుంది. ప్రస్తుతం వాహనాల ఉత్పత్తి వంటి రంగాలు కూడా కుదేలై పోయాయి. ఇతర రంగాల పెనుప్రభావం దానిపై పడటమే అందుకు కారణం.దేశంలోని స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠానికి అయిదు శాతానికి పడిపోయింది.


అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వ్యాపార స్పర్థతో భారతదేశానికి అపారమైన అవకాశాలు లభిస్తాయని అందరూ అంచనా వేశారు. కానీ దానిని సద్వినియోగం చేసుకోవడంలో భారత్ విఫలమైంది. ఫలితంగా మొదట అనుకున్న రీతిలో కూడా స్థూల జాతీయోత్పత్తి కనిపించడం లేదు. ఏడుశాతం వృద్ధి రేటు ఉంటుందనుకుంటే దాని కంటే మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పిన విధంగా “రెండు శాతం తక్కువ” గా కనిపిస్తోంది.


ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకుంటే రెండు శాతమంటే దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేరకు నష్టపోయినట్లే. దీనివల్ల ఎన్నికోట్ల మంది ఉపాధి కోల్పోయారో లెక్క గడితే సంఘటిత, అసంఘటిత రంగాల్లో కలిపి అయిదు కోట్ల మంది ఉపాధికి విఘాతం కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నేరుగా ఉపాధి కోల్పోవడం, ఆదాయం పడిపోవడం, వ్యాపారం మందగించడం, వస్తువులకు డిమాండ్ తగ్గిపోవడం, సేవల పరిమాణం కుదించుకుపోవడం వంటి వివిధ రూపాల్లో దీని ప్రభావం ఉంటుంది.


కొనుగోళ్లు మందగించడంతో వాహనతయారీ, విక్రయ రంగంలోనే ప్రత్యక్షంగా 50లక్షల పైగా  ఉపాధి కోల్పోయి ఉంటారని అంచనా.  ఆటోమోబైల్ రంగం ఇప్పట్లో కోలుకో లేనంతగా దెబ్బతింది. నోట్లరద్దు నుంచి అసంఘటిత రంగం అస్తవ్యస్తంగా మారింది. నిర్మాణరంగంలో కూలీలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు మైనింగ్, వ్యవసాయ, రియాల్టీ రంగాలన్నీ అభివృద్ధి రేటులో పతనం సుస్పష్టం. జీడీపీ క్షీణించింది.


బ్యాంకుల విలీనం వంటి చర్యలు కొంత మేర నిధులు, నగదు ప్రవాహాన్నిపెంచేందుకు, ఆర్థికసేవల మెరుగుదలకు పరిమితంగా మాత్రమే తోడ్పడతాయి.  కానీ సువిశాల భారతావని మధ్య తరగతి మయం. కోట్లాది జనబాహుళ్యానికి ఇవేమీ పెద్దగా ఉపకరించే చర్యలు కాదనే చెప్పాలి. కాని నిధులలేమి, నిరర్థక ఆస్తులతో బ్యాంకులు కూలి పోకుండా  పరిరక్షణ చర్యలలో భాగంగానే న్యాంకుల విలీనాన్ని చూస్తున్నారు.


దేశంలో వివిధ రంగాలు దెబ్బతినడంతో ప్రభుత్వానికి లభించే ఆదాయం కూడా పడిపోతుంది. ప్రజల కొనుగోలు, సేవల వ్యయం ఎక్కువగా ఉంటే ప్రత్యక్ష, పరోక్ష  పన్నులు, సెస్ ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయ వృద్ధితో వనరుల ప్రవాహం నిరంతరం లభిస్తుంది.


అంచనాకు తగిన విధంగా ఆదాయం రాకపోతే అప్పులు చేయాల్సి వస్తుంది. ఆర్థిక రంగం పటిష్టంగా లేకపోతే ప్రభుత్వ ఋణాలకు సైతం అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఈ మొత్తం పర్యవసానాలన్నీ చూసుకున్న తర్వాతనే కొంతలో కొంత వెసులుబాటు పొందేందుకు - ప్రభుత్వ వ్యయాలకు, కొంతమేర బ్యాంకులకు నిధులు సమకూర్చటానికి (ఫండింగ్) ₹176000 కోట్లను ‘రిజర్వ్ బ్యాంకు కంటింజెన్సీ ఫండ్’ నుండి ప్రభుత్వం తన ఖాతాకు మళ్లించు కుంటోంది.


ప్రస్తుత పరిస్థితిని చూసి ప్రభుత్వంలో కూడా భయం చెలరేగి ఉండవచ్చు. అయితే గడచిన ఏడాది కాలంగా ఆర్ధికమాంద్యం వాతావరణం కనిపిస్తున్నా, పూర్తిగా రాజకీయ ప్రాధాన్యతలకు, కాశ్మీర్ సమస్యలకు పెద్దపీట వేసిన ఎన్డీఏ ప్రభుత్వం దీనిని నిర్లక్ష్యం చేసిందనే చెప్పాలి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన వ్యూహ, ప్రతివ్యూహాల్లో కూడా కొంత మునిగిపోవటం మూలంగా కూడా ఈ ఆర్ధిక సంక్షోభం ప్రమాదస్థాయికి చేరింది. అంతర్జాతీయంగా మనదేశానికి అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వ్యాపారస్పర్థ వలన మన ముంగిట్లోకి వచ్చిన అవకాశాలను కూడా వదులుకోవాల్సి వచ్చింది.


‘పొలిటికల్ ప్రయారిటీ’ ముందు ‘ఆర్థిక రంగం’ తన ప్రాభవాన్ని-ప్రాముఖ్యాన్ని కోల్పోయింది.  ఇప్పుడు అమలుపరచనున్న దిద్దుబాటు చర్యల వలన కొంత మేరకు సత్ఫలితాలు లభించవచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: