తెలంగాణలోని జాతీయ రహదారుల పనులు చేపట్టండి..

DRK Raju
తెలంగాణ రాష్ట్రంలో భరతమాల పరియోజన ప్రాజెక్టు కింద గుర్తించిన కొదాడ-ఖమ్మం(31.800కిలోమీటర్ల) నాలుగు లేన్ల రహదారి నిర్మాణ పనులు మొదలుపెట్టాలని టీఆర్ ఎస్ లోక్ సభాపక్ష నాయకులు నామా నాగేశ్వరరావు కేంద్ర ఉపరితల రవాణ, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఈ రహదారి నిర్మాణం కోసం 180 హెక్టార్లు భూసేకరణ చేపట్టాల్సి ఉండగా, ఇప్పటికే 147 హెక్టార్లు భూమిని 
జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ సేకరించిందని ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే 57 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారాని ఆయన వివరించారు. 80 శాతం భూసేకరణ పూర్తయిందని స్పష్టం చేశారు. నాలుగు లేన్ల రహదారి ప్రాజెక్ట్ కోసం టెండర్లు కూడా పిలిచారాని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రహదారుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆయన స్ఫష్టం చేశారు. కొదాడ-ఖమ్మం-కురవి(40) కిలోమీటర్ల రోడ్డును ఖమ్మం-కురవి(76)కిలోమీటర్ల రోడ్ గా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ఎన్ హెచ్ 365ఏ కొదాడ-ఖమ్మం-కురవి రోడ్డును అభివృద్ధి చేయలేదని ఆయన తెలిపారు.




ఖమ్మం-కురవి రోడ్డు నిర్మాణానికి 2016-17వ సంవత్సరం వార్షిక ప్రణాళిక కింద 220 కోట్ల రూపాయలు మంజూరు చేశారాని ఆయన పేర్కొన్నారు. దీని కోసం ఎంఓఆర్ టీహెచ్ అధికారులు సమగ్ర నివేదికను రూపొందించారు కానీ అలైన్ మెంట్ తయారుచేయలేదని అన్నారు. జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ఎన్ 365బీబీ సూర్యపేట్-ఖమ్మం మరియు ఎన్ 563 నాగపూర్-అమరావతి మార్గాలను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేస్తోందని ఆయన తెలిపారు. ఖమ్మం-కురవి రహదారిని అభివృద్ధి చేస్తే ఖమ్మం పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్ వచ్చి ప్రజలకు సులభతరమైన రవాణా సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం-కురవి జాతీయ రహదారి నిర్మాణంతో ఖమ్మం పట్టణానికి మహబూబాద్ తో అనుసంధానం ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఈ మార్గంలో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలు,గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. ఈ రోడ్ లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని, 5.50 మీటర్ల వెడల్పు కారణంగా ఈ సమస్య తలెత్తుతుందని అన్నారు. 



ఖమ్మం-కురవి ఎన్ (365ఏ) రహదారి నిర్మాణానికి అలైన్ మెంట్ తయారు చేసి ఖమ్మం కు నాలుగు లేన్ల బైపాస్ రోడ్ ఏర్పాటు చేయాలని ఎంఆర్ టీహెచ్ అధికారులను ఆదేశించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 3,155 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులను జాతీయరహదారులుగా నిర్మాణం చేయాలి, ఇప్పటి వరకు కేవలం 1,388 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్లను మాత్రమే జాతీయ రహదారులుగా గుర్తించారు, మరో 1,767 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి, నిర్మాణం చేయాలని ఆయన తెలిపారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి, నిర్మాణం చేపట్టేందుకు భూ సేకరణలో 50 శాతం వ్యయం,ఆటవి భూముల మళ్లింపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సీఎం కేసీఆర్  పలుమార్లుకేంద్రమంత్రికి లేఖలు రాశారాని కి నామా తెలిపారు. చౌటుప్పల్-షాద్ నగర్-కంది 186 కిలోమీటర్ల దక్షిణ భాగ ప్రాంతీయ వలయ రహదారి హైదరాబాద్ వరకు, సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-భువనగిరి-చౌటుప్పల్ ఉత్తర భాగ ప్రాంతీయ వలయ రహదారి ని కలపాలని ఆయన తెలిపారు.




దీనిని ఇప్పటికే జాతీయ రహదారి 161ఎఎ గా గుర్తించారు, కానీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ మొదలుపెట్టాలని పేర్కొన్నారు. జనవరి 1వ తేదీ,2019న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  కేంద్రానికి లేఖ రాశారాని స్పష్టం చేశారు. ఈ నాలుగు రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణలో 50 శాతం వ్యయం భరిస్తుందని, ఆటవి భూముల మళ్లింపు వంటి ఆంశాలను చేపడుతుందని ఆయన తెలిపారు. ఆగస్ట్ 29వ తేదీ,2018వ సంవత్సరం మరియు ఆగస్ట్ 1,2019వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  మరో రెండు లేఖలు కేంద్రానికి రాశారాని ఆయన అన్నారు. ప్రాంతీయ వలయ రహదారుల కోసం భూ సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వ్యయాన్ని భరిస్తుందని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: