రాజ్ నాధ్ ఆయుధ పూజ - రఫేల్ గగన విహారం - పాక్ గుండెల్లో రైళ్ల పరుగులు

భారత వైమానిక దళం అమ్ములపొదిలో మరో అత్యంత ముఖ్యమైన అస్త్రం చేరింది. ఫ్రాన్స్‌ దేశం తయారు చేసిన రఫేల్‌ యుద్ధ విమానం దసరా - విజయదశమి రోజున భారత్‌కు అందింది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రన్‌ చేతుల మీదుగా భారత రక్షణ

బోర్డియాక్స్‌ లో రఫేల్‌ యుద్ధవిమాన స్వీకరణ కార్యక్రమం ఉత్సవంలా జరిగింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ:  "అనుకున్న సమయానికి రాఫేల్‌ అందుకోవడం ముదావహం. రాఫేల్‌ రాక తో భారత వాయుసేన మరింత బలోపేతం అవుతుంది. రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారం అన్ని రంగాల్లో మరింతగా ఇనుమడిస్తుందని ఆశిస్తున్నాను. ఇవాళ భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంలో నూతనాధ్యాయం. రఫేల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లో ప్రయాణించాలని ఎంతోకాలంగా ఉత్సాహంగా ఈ రోజుకోసం నిరీక్షిస్తున్నాను. దసరా భారత్ కు ఎంతో పర్వదినం పురాణకాలం నుండి చారిత్రాత్మక కాలమే కాదు ఆధునిక కాలంలోను ఆ ఉత్తేజం ఉత్సాహం ఇనుమడిస్తూ వస్తునా రోజిది. ఇవాళ చెడుపై  మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారత్‌లో


raj nath ayudhapuja" />