రాజ్యాంగ వ్యవస్థల హితవులను సైతం పెడచెవిన పెడుతున్న కేసీఆర్!

రోం నగరం తగలబడుతుంటే చక్రవర్తి నీరో పిడేల్ వాయిస్తూ తన్మయత్వంలో ఉన్నారట. దాన్నే ఇప్పుడు కేసీఆర్ అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది. గత రెండు వారాలుగా నిరంతరం ప్రజా రవాణా వ్యవస్థ - టిఎస్ ఆర్టీసి ఉద్యోగుల సమ్మె కారణంగా దాదాపు ప్రభుత్వం చెప్పుకుంటూ చేసే అరకొర ఏర్పాట్లు ఏ మూలకూ సరిపోకపోగా దాదాపు మూతపడింది. అటు ముఖ్యమంత్రి మంకుపట్టు, ఇటు టీఎస్-ఆస్ర్టీసి ఉద్యోగులు తమ సంస్థ ప్రయివేట్ వ్యక్తుల పరం కాకుండా కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొనే సమ్మె - సమ్మెట పోటుకు బలయ్యేది ప్రజలే. అందుకే అటు అత్యధిక శాతం ప్రజలు టీఎస్ ఆర్టీసికి తమ మద్దతు ప్రకటించినట్లే. ఇది ఆర్టీసి ఉద్యోగుల నైతిక విజయంగానే భావించాలి. ఒక రకంగా నిన్న హైకోర్ట్ లో నెలకొన్న పరిస్థితులు న్యాయస్థానం లాంటి రాజ్యాంగ వ్యవస్థ నైతిక మద్దతు కూడా పొందినట్లే.  

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మనసు రాష్ట్ర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ - వ్యవహరించిన తీరున - ఒక తండ్రి లాగా ప్రవర్తిస్తే, టిఎస్ ఆర్టీసి ఉద్యోగులు తండ్రి మాట వినే కొడుకుల్లాగా మారటం సహజం.  తెలంగాణ హైకోర్ట్ ఒకటో నంబరు కోర్టు హాల్లో నిన్న శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ఏఏజీ – హైకోర్ట్ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి లతో కూడిన ధర్మాసనం మద్య చర్చల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆర్టీసీ సమ్మెపై జరిగిన చర్చల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ క్రియా శీలపాత్ర పోషించారు. 

చట్టాలలోని అంశాలను సృజించకుండా తండ్రిలాగా టిఎస్-ఆర్టీసీ కార్మికుల ప్రాథమిక హక్కుల పరిరక్షణను బాధ్యతగా తీసుకున్నారు. ఒక ప్రక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని బుజ్జగిస్తూ, కొండోకచో మందలిస్తూ ప్రభుత్వం పోషించాల్సిన ప్రజాస్వామ్య పాత్రెలా ఉండాలో గుర్తుచేశారు.  టిఎస్ ఆర్టీసి కార్మికుల తరఫున రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. చర్చల కోసం ఆర్టీసీ కార్మికులు ముందు కొస్తుంటే, ప్రభుత్వ చర్చలు విఫలమయ్యాయని, “లేబర్‌ కోర్టు” లో తేల్చుకుంటామని మొండిగా వాదించడం సరైన పద్దతి కాదని హితవు పలికారు. 


ఇప్పుడు సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్ ఆర్టీసి మద్య కాదని వీళ్ళిద్ధరి మద్య సాండ్విచ్చై నలిగ్పోతున్న రాష్ట్ర ప్రజలదని  - రాష్ట్ర ప్రజల తీవ్ర అసౌకర్యాన్ని సంకట పరిస్థితి గుర్తెరిగి ప్రవర్తించాలని, అహంభావాలు, అహంకారాలు వదిలేసి చర్చల ద్వారా సమస్య పరిష్కారం సాధించే దిశగా  “బింగో గేమ్‌ కాన్సెప్ట్” ను అనుసరిస్తూ అడుగులు వేయాలని అన్నారు.

వాది-ప్రతివాదుల మధ్య ఒక సమన్వయకర్తగా వ్యవహరించి, సమస్యను సామరస్యంగా కుటుంబసభ్యుల మధ్య తగవులా పరిష్కరించుకొనేందుకు చొరవ తీసుకొవల సిందిగా ఇరు వర్గాలను అభ్యర్థించి సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు.  కార్మికుల 45 డిమాండ్లలో 20 డిమాండ్లు పూర్తిగా హేతుబద్ధమైనవని, వాటివల్ల సంస్థ మీద ఆర్థిక భారం ఏమీ పడదని, వాటిని వెంటనే పరిష్కరించాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. ఒక దశలో నేడు ఉదయం పదిన్నరకే సంప్రదింపులు మొదలు కావాలని అన్నారు.


ప్రధానమైన డిమాండ్‌ అయిన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామని కార్మికులేమీ షరతు పెట్టడం లేదని గుర్తు చేశారు. అత్యంత శక్తివంతమైన ప్రభుత్వానికి, కార్మికులకు మధ్య సంబంధం తండ్రీ కొడుకుల సంబంధమని, కార్మికుల డిమాండ్లను కొడుకు అవసరాలను తండ్రి చూసినట్లుగా సానుభూతి పూర్వకంగా చూడాలే తప్ప పట్టుదలకు పోరాదని సూచించింది. ఆర్టీసీలోని కార్మికులు ప్రజల్లోని వాళ్ళేనని -

‘సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొనేందుకు ఆర్టీసీ ఎండీ శనివారమే కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని కోరింది. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ఇంతకుముందే సూచించినా, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో శుక్రవారం విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శనివారం చర్చలు జరపాల్సిందేనని మరీ నొక్కి చెప్పింది. 


ప్రజారవాణా ఉద్యోగులసమ్మె మొదలై పదిహేనురోజులు పూర్తైనా పరిష్కరించేదిశగా ప్రభుత్వంవైపు నుంచి ఎలాంటి చర్యలులేవని అసహనం వ్యక్తంచేసింది. ‘సామాన్యుడి శక్తి సామర్థాలను తక్కువగా అంచనా వేయొద్దు. వాళ్లు తిరగబడితే తట్టుకోలేరు’ హెచ్చరించింది. ఇప్పటికే ప్రజలు,విపక్షాలు, తటస్తులు టిఎస్ ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపు తున్నారని, మరికొంత మంది మద్దతు తెలిపితే ఆందోళనను అడ్డుకోగలమా? అని సున్నితగా హెచ్చరించింది. 


ఇందుకు ఫిలిప్పీన్స్‌ ప్రజా ఉద్యమాలను హైకోర్ట్ ఉదహరించింది. కార్మికుల డిమాండ్లు అన్నింటినీ చదివి వినిపించిన ధర్మాసనం, వీటిని పరిష్కరించేందుకు ఉన్న అభ్యంతరాలు తనకు కనిపించటం లేదన్నట్లు – అలాంటివేమైనా ఉంటే ధర్మాసనానికి తెలియ జేయాలని ప్రభుత్వాన్ని కోరింది. కోర్టు సమయం ముగిసినా, ధర్మాసనం ఈ పిటిషన్లపై వాదనలు వింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: